అన్వేషించండి

Allu Arjun - Devi Sri Prasad: బన్నీ అండ్ సుక్కుతో దేవి... వాళ్ల మధ్య గొడవల్లేవ్, పుకార్లకు చెక్ పెట్టేలా చంద్రబోస్ ఫోటోలు

Chandra Bose Shares Pushpa 2 Team Photos: అల్లు అర్జున్, సుకుమార్, ఇంకా నిర్మాతలతో దిగిన ఫోటోలను లిరిసిస్ట్ చంద్రబోస్ షేర్ చేశారు. పుకార్లకు చెక్ పెట్టేలా ఆయన పోస్ట్ ఉందని చెప్పాలి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ జీనియస్ సుకుమార్, మ్యూజికల్ రాక్ స్టార్ దేవి‌ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మధ్య సత్సంబంధాలు ఉన్నాయా లేవా? ఆ ముగ్గురి మధ్య గొడవ జరిగిందా? అందుకే నేపథ్య సంగీతం చేయడానికి తమన్ వచ్చారా? పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులలోనూ బోలెడు సందేహాలు! వీటన్నిటికీ చెక్ పెట్టేలా లిరిసిస్ట్ చంద్రబోస్ కొన్ని ఫోటోలు షేర్ చేశారు.

బన్నీ అండ్ సుక్కుతో దేవి!
'పుష్ప: ది రైజ్' సినిమాలో పాటలు అన్నిటిని చంద్రబోస్ రాశారు. ఆ సినిమా సీక్వెల్ 'పుష్ప ‌2: ది రూల్' (Pushpa 2 The Rule)లో పాటలనూ ఆయనే రాశారు. సుకుమార్ సినిమా అంటే చంద్రబోస్ పాట కంపల్సరీ. అందులోనూ నేషనల్ వైడ్ భారీ హిట్ సాధించిన, ఆస్కార్ అవార్డు సాధించిన నాటు నాటు పాట ఉన్న 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధరం' తర్వాత చంద్రబోస్ పాటలు రాసిన పాన్ ఇండియా సినిమా కావడంతో 'పుష్ప 2' సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. 

'పుష్ప 2' ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. అందులో ప్రతి ఫ్రేమ్ లో తన నేపథ్య సంగీతం ఉందని దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశాడు. 'పుష్ప 2' చిత్రానికి 15 రోజులలో నేపథ్య సంగీతం చేయలేమని, తన దగ్గరకు అవకాశం వచ్చినప్పుడు సవాలుగా తీసుకొని ఫస్ట్ హాఫ్ వరకు రీ రికార్డింగ్ చేశానని తమన్ చెప్పిన కొన్ని గంటలకు ట్రైలర్ విడుదల అయింది. దాంతో ట్రైలర్ వరకు ఎవరూ రీ రికార్డింగ్ చేసి ఉంటారు? ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ తమన్ చేస్తే దేవి శ్రీ ప్రసాద్ ఏం చేశారు? అని బోలెడు సందేహాలు తలెత్తాయి. 

View this post on Instagram
 
A post shared by Chandrabose (@boselyricist)

బన్నీ సుక్కులతో దేవి శ్రీకి పడడం లేదు అని, అందుకే మరొక సంగీత దర్శకుడు రీ రికార్డింగ్ చేయడానికి వచ్చారని గుసగుసలు చాలా వచ్చాయి. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెడుతూ... హీరోతో పాటు దర్శకుడు సంగీత దర్శకుడు నిర్మాతలతో కలసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో చంద్రబోస్ షేర్ చేశారు. అందులో అందరితో కలిసి నవ్వుతూ దేవి కనిపించారు. దాంతో వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు లేవని అనుకోవచ్చు.

Also Read: 'పుష్ప 2'లో ఫహాద్ ఫాజిల్ నట విశ్వరూపం చూస్తారు... భన్వర్ సింగ్ షెకావత్ రియల్ వైఫ్ ఏమందో తెలుసా?

డిసెంబర్ 5వ తేదీన తెలుగుతో పాటు హిందీ మలయాళ కన్నడ తమిళ బెంగాలీ భాషల్లో 'పుష్ప 2: ది రూల్' విడుదల అవుతుంది. అల్లు అర్జున్ జోడీగా శ్రీవల్లి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక నటించిన ఈ సినిమాలో బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్, ఇంకా ఇతర కీలక పాత్రల్లో అనసూయ భరద్వాజ్, సునీల్, డాలి ధనుంజయ, తారక్ పొన్నప్ప తదితరులు నటించారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రాన్ని హిందీలో అనిల్ తడానీ విడుదల చేస్తున్నారు. అమెరికాలో డిసెంబర్ 4న ప్రీమియర్ షోలు వేయడానికి ప్లాన్ చేశారు.

Also Read Pushpa 2 Trailer Launch Highlights - పాట్నా ప్రజల ప్రేమకు ఐకాన్ స్టార్ ఫిదా... బన్నీ స్పీచ్ to 2 లక్షల మంది జనాలు, పోలీస్ సెక్యూరిటీ - 'పుష్ప 2' ట్రైలర్ లాంఛ్ హైలైట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Mahakumbha Mela 2025 : మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
Embed widget