అన్వేషించండి

Pushpa 2 First Single: ‘పుష్ప 2’ నుంచి క్రేజీ అప్డేట్ - మొదటి పాట వచ్చేస్తుంది

Pushpa 2 First Single: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ నుండి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇందులో నుండి మొదటి పాటను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు.

Pushpa 2 First Single Update: దాదాపుగా రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’. ఈ మూవీ మొదట్లో మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది. కానీ మెల్లగా ఇందులోని పాటలు, హీరో మ్యానరిజం ఇతర భాషా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. దీంతో ‘పుష్ప 2’పై అంచనాలు పెరిగిపోయాయి. అప్పటినుంచి ఈ సినిమాలో ఎన్నో మార్పులు చేర్పులు మొదలయ్యాయి. దాని కారణంగా షూటింగ్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది. ఫైనల్‌గా ఆగస్ట్ 15న ‘పుష్ప 2’ విడుదల కచ్చితంగా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో మూడు నెలల ముందే ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తున్నారు.

మొదటి పాట అప్డేట్..

ఆగస్ట్ 15.. అంటే ‘పుష్ప 2’ విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఇప్పటినుండే మూవీపై ఏర్పడిన హైప్‌ను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా ‘పుష్ప 2’ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో ఒక్క డైలాగ్ లేకపోయినా యూట్యూబ్‌లో విడుదలయిన 138 గంటల్లోనే 110 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడంతో పాటు 1.55 లైక్స్‌ను కొట్టేసింది. అంతే కాకుండా కొన్ని రోజుల పాటు ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్ స్థానంలో నిలబడింది. ఇది చూసిన మేకర్స్.. ఇక ‘పుష్ప 2’కు సంబంధించిన అప్డేట్స్ విషయంలో ఆలస్యం చేయకూడదని డిసైడ్ అయ్యారనుకుంటా! అందుకే మొదటి పాట గురించి అప్డేట్ ఇస్తూ పోస్ట్ చేశారు.

పుష్ప పుష్ప..

‘ఈ ప్రపంచం పుష్ప రాజ్ గురించి పొగుడుతూ పాట పాడుతుంది’ అంటూ ‘పుష్ప 2’కు సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్డేట్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్. రేపు.. అంటే ఏప్రిల్ 24న సాయంత్రం 4.05 నిమిషాలకు ‘పుష్ప 2’లోని మొదటి పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫస్ట్ సింగిల్ టైటిల్ ‘పుష్ప పుష్ప’ అని కూడా బయటపెట్టారు. ఆగస్ట్ 15న ‘పుష్ప 2’ థియేటర్లలో సందడి చేస్తుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. దీంతో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇన్నిరోజులు ఎదురుచూసినందుకు ఔట్‌పుట్ బాగుంటే చాలు అని ఫీలవుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

డీఎస్‌పీ మ్యూజిక్..

‘పుష్ప 2’లోని పాట ఎలా ఉంటుందో తెలియక ముందే.. దీని ద్వారా మరోసారి యూట్యూబ్ రికార్డ్స్ అన్నీ అల్లు అర్జున్ తిరగరాస్తాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’కు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ‘పుష్ప’లో పాటలకు వరల్డ్ వైడ్‌గా క్రేజ్ లభించినా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మాత్రం డీఎస్‌పీ ఫెయిల్ అయ్యాడని అప్పట్లో ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్స్ చేశారు. కానీ తాజాగా విడుదలయిన ‘పుష్ప 2’ టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను బాగా ఇవ్వడంతో ఫ్యాన్స్ అంతా మళ్లీ తనను ప్రశంసిస్తున్నారు.

Also Read: బ్రో షూటింగ్‌లో బిజీగా ఉన్నా.. ఆయన మాకు టైమ్ ఇచ్చారు - జై పవర్ స్టార్: తేజ సజ్జా

టాప్ హెడ్ లైన్స్

Saripoyaru Iddaroo: 'శతమానం భవతి' దర్శకుడి కొత్త సినిమా... టీజర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి
'శతమానం భవతి' దర్శకుడి కొత్త సినిమా... టీజర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి
Dada Movie Update : దాదా సెట్స్‌లో బాలయ్య - గాయం తర్వాత కీలక సీన్స్ షురూ
దాదా సెట్స్‌లో బాలయ్య - గాయం తర్వాత కీలక సీన్స్ షురూ
Maremma OTT: రెండు ఓటీటీల్లోకి 'మారెమ్మ'... రవితేజ ఫ్యామిలీ హీరో మాధవ్ భూపతిరాజు సినిమా స్ట్రీమింగ్ ఎందులోనంటే?
రెండు ఓటీటీల్లోకి 'మారెమ్మ'... రవితేజ ఫ్యామిలీ హీరో మాధవ్ భూపతిరాజు సినిమా స్ట్రీమింగ్ ఎందులోనంటే?
Romantic Movie OTT : ట్రెండింగ్ బోల్డ్ రొమాంటిక్ మూవీ - పెద్దలకు మాత్రమే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్ బోల్డ్ రొమాంటిక్ మూవీ - పెద్దలకు మాత్రమే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget