Prabhas First Look Project K : ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్ - 'ప్రాజెక్ట్ కె'లో హాలీవుడ్ సూపర్ హీరోలను తలదన్నేలా రెబల్ స్టార్
Project K Movie First Look Prabhas : 'ప్రాజెక్ట్ కె' నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ రివీల్ చేశారు.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఫుల్ కిక్. వాళ్ళు ఎంత గానో ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ విడుదల చేశారు నాగ్ అశ్విన్. అదీ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెవల్లో!
ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' లుక్ వచ్చేసిందోచ్!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా (Project K Movie). ఈ నెల 21న టైటిల్ రివీల్ చేయనున్నారు. అంత కంటే ముందు అభిమానులకు కానుక ఇచ్చారు. ఈ రోజు ప్రభాస్ ఫస్ట్ లుక్ (Prabhas First Look Project K) విడుదల చేశారు. దీని కంటే ముందు దీపికా పదుకోన్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ లుక్ చూస్తే యోధుడిగా ఉన్నారు. హాలీవుడ్ సూపర్ హీరోలను తలదన్నేలా ఆయన లుక్ ఉందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : నిర్మాతగా 'బాహుబలి' సేతుపతి - ఈసారి కొత్త హీరో హీరోయిన్లతో!
View this post on Instagram
'ప్రాజెక్ట్ కె' అంటే 'కాలచక్రం'!?
'ప్రాజెక్ట్ కె' టైటిల్ (Project K Title)ను భారతీయ కాలమానం ప్రకారం ఈ నెల 21న ఉదయం ఒంటి గంట నుంచి రెండున్నర గంటల మధ్యలో అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే... టైటిల్ ఇదేనంటూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఓ పేరు చక్కర్లు కొడుతోంది. 'ప్రాజెక్ట్ కె' అంటే 'కాలచక్రం' (KaalChakra) అని జోరుగా ప్రచారం జరుగుతోంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా కనుక ఆ టైటిల్ అయితే బావుంటుందని ఫిక్స్ అయ్యారట.
కాలంలో వెనక్కి వెళ్లడం, ముందుకు రావడం వంటి అంశాల నేపథ్యంలో 'ప్రాజెక్ట్ కె' సినిమా రూపొందుతోంది. కృష్ణుడి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. మరి, ఈ కాలచక్రం చేసే మాయ ఏమిటో? వెండితెరపై చూడాలి. సృష్టిలో విధ్వంస శక్తులను కథానాయకుడు ఎదుర్కోవడంలో కాలచక్రం పాత్ర ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కె అంటే కాలచక్రమా? కదా? అనేది త్వరలో, మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.
Also Read : మళ్ళీ రెమ్యూనరేషన్ పెంచేసిన శ్రీ లీల - నితిన్ సినిమాకు డిమాండ్ మామూలుగా లేదుగా!
జూలై 19 నుంచి అమెరికాలోని శాన్ డియాగోలో జరిగే కామిక్ కాన్ వేడుకల్లో 'ప్రాజెక్ట్ కె' టైటిల్, ఇంకా గ్లింప్స్ విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ఆ కార్యక్రమం కోసం ప్రభాస్, దీపికా పదుకోన్ సహా చిత్ర బృందంలో కీలక సభ్యులు పాల్గొంటారు.'ప్రాజెక్ట్ కె'లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లెజెండ్స్‌లో ఒకరైన అమితాబ్ బచ్చన్ ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఇటీవల లోక నాయకుడు కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించారు.
'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ (Prabhas)కు ధీటైన ప్రతినాయకుడిగా కమల్ హాసన్ (Kamal Haasan) నటించనున్నారని కొన్ని రోజులుగా వినపడుతోంది. విలన్ అని చిత్ర బృందం చెప్పలేదు గానీ సినిమాలో కమల్ ఉన్నారని కన్ఫర్మ్ చేసింది. దాంతో ఆయన పాత్ర ఎలా ఉంటుంది? ప్రభాస్, కమల్ మధ్య సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి? అని ప్రేక్షకులు ఆలోచించడం మొదలు పెట్టారు.
ఈ సినిమాలో దిశా పటానీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న సినిమా విడుదల చేయనున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial