News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sreeleela Remuneration : మళ్ళీ రెమ్యూనరేషన్ పెంచేసిన శ్రీ లీల - నితిన్ సినిమాకు డిమాండ్ మామూలుగా లేదుగా!

Sreeleela demands more money now? ప్రస్తుతం హీరోయిన్ శ్రీ లీల చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. రష్మిక వాకవుట్ చేయడంతో నితిన్ సినిమాకు ఓకే చెప్పారు. ఆ సినిమాకు భారీగా డిమాండ్ చేశారట.

FOLLOW US: 
Share:

హాట్ అండ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీ లీల మళ్ళీ రెమ్యూనరేషన్ పెంచినట్లు (Sreeleela Remuneration) టాలీవుడ్ గుసగుస. ఇప్పుడు తెలుగులో బాగా బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరు? అంటే ఈ భామ పేరే చెప్పాలి. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కొత్తగా మరో సినిమాకు ఓకే చెప్పారు. అది నితిన్ హీరోగా వెంకీ కుడుముల తీస్తున్న సినిమా. దానికి భారీగా డిమాండ్ చేస్తున్నారట. ఆమె క్రేజ్ చూసి నిర్మాతలు కూడా ఓకే అన్నారట. 

రష్మిక హ్యాండ్ ఇవ్వడంతో...
'భీష్మ' త్రయం... అదేనండీ హీరో హీరోయిన్లు నితిన్, రష్మిక, దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా మొదలు పెట్టిన సంగతి తెలుసు. ఆ మేరకు క్రియేటివిటీ జోడించి ఓ వీడియో కూడా విడుదల చేశారు. అయితే... ఇప్పుడు ఏమైంది? నితిన్ & వెంకీ కుడుములకు రష్మిక హ్యాండ్ ఇచ్చారు. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జోడీగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పుష్ప 2'తో పాటు రెండు మూడు బాలీవుడ్ ప్రాజెక్టులు ఉండటంతో ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేనని రష్మిక చెప్పేశారు. సినిమా నుంచి వాకవుట్ చేశారు. దాంతో వెంకీ కుడుముల కొత్త హీరోయిన్ వేటలో పడ్డారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ జోడీగా నటిస్తున్న శ్రీ లీలను సంప్రదించారు. చేతి నిండా సినిమాలు ఉన్నప్పటికీ... మరోసారి నితిన్ సరసన నటించడానికి రష్మిక ఎస్ చెప్పారు. అయితే... రెమ్యునరేషన్ మాత్రం భారీ పెంచేశారట. 

రెండు కోట్లు డిమాండ్ చేస్తున్న శ్రీ లీల!?
'ధమాకా'కు ముందు శ్రీ లీల ఖాతాలో పెద్దగా హిట్స్ లేవు. అయితే... ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను ఆమె బాగా క్యాష్ చేసుకున్నారు. 'ధమాకా'కు ఆవిడ అందుకున్న పారితోషికం కోటి రూపాయల లోపే అని టాక్. 'ధమాకా' తర్వాత మరిన్ని ఛాన్సులు రావడంతో ఇప్పుడు రెమ్యూనరేషన్ డబుల్ చేశారట. నితిన్ సినిమాకు రెండు కోట్లు డిమాండ్ చేశారట. శ్రీ లీలకు ఉన్న క్రేజ్ చూసి అంత ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యారని టాక్.

Also Read : కుట్రలకు, ఆలోచనలకు మధ్యలో అసమాన్యుడుగా ఎదిగిన నాయకుడు జగన్ - ఇదీ వర్మ 'వ్యూహం'

Sreeleela Upcoming Movies : ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న 'గుంటూరు కారం'లో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాల్లో శ్రీ లీల మెయిన్ హీరోయిన్. నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న 'భగవంత్ కేసరి'లో కీలక పాత్ర పోస్తున్నారు. ఇంకా రామ్ 'స్కంద', పంజా వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ', నవీన్ పోలిశెట్టితో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి. అందుకని, ఇప్పుడు ఒక్కో సినిమాకు రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారట. గతంలో రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే వంటి హీరోయిన్లు ఒక్కో సినిమాకు రెండు కోట్లు అందుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఖాతాలో శ్రీ లీల కూడా జాయిన్ అయ్యారన్నమాట. 

Also Read ఆలీకి పవన్ కళ్యాణ్ ఝలక్ - స్నేహానికి పూర్తిగా తెగతెంపులు?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 18 Jul 2023 04:41 PM (IST) Tags: sreeleela remuneration Sreeleela upcoming movies Nithiin Sreeleela Movie Sreeleela Demands

ఇవి కూడా చూడండి

Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్

Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్

Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్

Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్

Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?

Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?

Vijay Antony: మూవీ ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్

Vijay Antony:  మూవీ ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్

Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్

Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్

టాప్ స్టోరీస్

RK Roja: ఆటో డ్రైవర్‌ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?

RK Roja: ఆటో డ్రైవర్‌ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం