News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vyuham Update : కుట్రలకు, ఆలోచనలకు మధ్యలో అసమాన్యుడుగా ఎదిగిన నాయకుడు జగన్ - ఇదీ వర్మ 'వ్యూహం'

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'వ్యూహం'. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఆల్రెడీ 50 శాతం సినిమా పూర్తి చేశామని నిర్మాత దాసరి కిరణ్ తెలిపారు.

FOLLOW US: 
Share:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhara Reddy) మరణం, ఆ తర్వాత జరిగిన పరిస్థితుల నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా 'వ్యూహం' (Vyuham Movie). ఇందులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పాత్రలో 'రంగం'తో పాటు కొన్ని సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ నటుడు అజ్మల్ అమిర్ (Ajmal Amir) నటిస్తున్నారు. 

'వ్యూహం'లో వైఎస్ భారతి పాత్రలో అజ్మల్ జోడీగా మానస నటిస్తున్నారు. శ్రీ రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌  నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఆల్రెడీ 50 శాతం చిత్రీకరణ పూర్తి చేశామని నిర్మాత దాసరి కిరణ్ తెలిపారు. 

'వ్యూహం' గురించి దాసరి కిరణ్ మాట్లాడుతూ ''నిర్మాణ పరంగా మేం ఎక్కడా రాజీ పడటం లేదు. రామ్ గోపాల్ వర్మ ప్రతిభ గురించి మనకు తెలుసు. 'వ్యూహం' సెట్స్ మీద ఆయన ప్రతిభ చూసి మరోసారి ఆశ్చర్యపోయా. అంత గొప్పగా తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని చెప్పారు. కుట్రలకు, ఆలోచనలకు మధ్యలో అసమాన్యుడుగా ఎదిగిన నాయకుని కథే 'వ్యూహం' అని, ఆ నాయకుడు వైఎస్ జగన్ అని చిత్ర బృందం పేర్కొంది.

Also Read ఆలీకి పవన్ కళ్యాణ్ ఝలక్ - స్నేహానికి పూర్తిగా తెగతెంపులు?

వర్మ 'వ్యూహం'లో ఏముంది?
కొన్ని రోజుల క్రితం 'వ్యూహం' టీజర్ విడుదల చేశారు. అందులో స్టార్టింగ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూపించారు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యమంత్రి హోదాలో మరణానికి ముందు చేసిన హెలికాప్టర్ విజువల్స్ ఉపయోగించారు. వైయస్సార్ మరణం, ఆ తర్వాత వైయస్సార్ తనయుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ కేసులు పెట్టడం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు దారి తీసిన పరిస్థితులను 'వ్యూహం'లో చూపించనున్నారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. 

Also Read : పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేసిన చిరంజీవి - ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ మోహన్ రెడ్డికి మేలు చేసే విధంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీస్తారని ముద్ర పడింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన సినిమాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'వ్యూహం' టీజర్ చివరి డైలాగుల్లో కూడా చంద్రబాబు ప్రస్తావన ఉంది. 'అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు' అని జగన్ పాత్రధారి చేత డైలాగ్ చెప్పించారు.  

'వ్యూహం' రియల్ సినిమా - వర్మ!
'వ్యూహం' బయోపిక్‌ కాదని రామ్ గోపాల్ వర్మ చెబుతున్నారు. బయోపిక్ కంటే చాలా లోతైన రియల్‌ సినిమా అంటున్నారు. ఇందులో (వ్యూహం సినిమాలో) నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయని గతంలో కూడా ఓ సందర్భంలో ఆర్జీవీ తెలిపారు. మామూలుగా ఆర్జీవి ఏం చేసినా ట్రెండ్ అవుతుంది. అందులోనూ రాజకీయాలతో ముడి పడిన కామెంట్స్ చేయడం, రాజకీయాలపై సినిమాలు తీయడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య.  ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : సుజీష్‌ రాజేంద్రన్, కూర్పు : మనీష్ ఠాకూర్. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 18 Jul 2023 03:51 PM (IST) Tags: Ram Gopal Varma YS Jagan biopic Ajmal Ameer Vyuham Update Manasa

ఇవి కూడా చూడండి

Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం

Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!

WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!

Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా

Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా

అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి

అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి

టాప్ స్టోరీస్

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత