తెలుగబ్బాయి ఈషా రెబ్బా మోడ్రన్ డ్రస్ లో కూడా అదరగొట్టారు. ఇంతకీ, ఈ డ్రస్ ఆవిడ ఎక్కడ వేశారంటే? 'దయా' వెబ్ సిరీస్ లో ఈషా రెబ్బా అలివేలు పాత్రలో నటించారు. 'దయా' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఈషా రెబ్బా ఈ డ్రస్ లో సందడి చేశారు. ఈషా రెబ్బాతో పాటు 'దయా' వెబ్ సిరీస్ లో జేడీ చక్రవర్తి, విష్ణుప్రియ భీమనేని, రమ్యా నంబీసన్ నటించారు. ఆగస్టు 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో 'దయా' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈషా రెబ్బా నటించిన 'మయా బజార్' వెబ్ సిరీస్ ఇటీవల జీ 5లో విడుదలైంది. ఓటీటీ ప్రాజెక్టులతో పాటు సినిమాలు కూడా ఈషా రెబ్బా చేస్తున్నారు. ఈషా రెబ్బా ఇటీవల ఓ తమిళ సినిమా అంగీకరించారు. అందులో విక్రమ్ ప్రభు హీరో. ఈషా రెబ్బా (All Images Courtesy : yourseesha / Instagram)