అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ డెనిమ్ డ్రస్ లో కిర్రాక్ అనిపించారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన 'బవాల్' సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ నెల 21 నుంచి 'బవాల్' స్ట్రీమింగ్ కానుంది. 'బవాల్' సినిమాకు నితీష్ తివారి దర్శకత్వం వహించారు. 'బవాల్' కంటే ముందు బ్రేక్ పాయింట్, చచ్చోరే, దంగల్ సినిమాలకు నితీష్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు జాన్వీ కపూర్ తెలుగు హీరో సరసన కూడా నటిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'దేవర'లో కథానాయిక జాన్వీ కపూరే. హిందీలోనూ సినిమాలు చేస్తూ జాన్వీ కపూర్ బిజీ బిజీగా ఉన్నారు. జాన్వీ కపూర్ (Images Courtesy : manav manglani) Bawaal movie ప్రచార కార్యక్రమాల్లో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్