NTR Trivikram: ఎన్టీఆర్ మైథలాజికల్‍పై 'రామాయణ' ఎఫెక్ట్ - బిగ్ అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ నాగవంశీ
Nagavamsi: ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీపై బిగ్ అప్డేట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ నాగవంశీ. ఈ ప్రాజెక్ట్ కోసం భారీ స్థాయిలో ప్లాన్ చేశామని... ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు చెప్పారు.

Nagavamsi About NTR Trivikram Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ మైథలాజికల్ మూవీ రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
'రామాయణ'ను మించి భారీగా...
త్రివిక్రమ్ ఫస్ట్ టైం మైథలాజికల్ జానర్‌లో మూవీ తీస్తున్నారని దీన్ని భారీ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు చెప్పారు నాగవంశీ. 'ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ కోసం భారీ స్థాయిలో ప్లాన్ చేశాం. సీనియర్ ఎన్టీఆర్‌ను రాముడు, కృష్ణుడిగా చూశాం. ఈ మూవీలో తారక్‌ను ఆ స్థాయిలో చూడబోతున్నారు. నితేశ్ తివారీ 'రామాయణ' ప్రకటించిన తర్వాత దేశమంతా ఆ దాని గురించే మాట్లాడుకున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ ట్రెండింగ్‌గా మారింది.
ఈ సినిమా కంటే భారీగా మా మైథలాజికల్ మూవీని ప్రకటించాలని కొంత గ్యాప్ తీసుకున్నాం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2026 మధ్యలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం.' అని చెప్పారు. దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇదివరకు ఎవరూ తీయని... ఎవరికీ తెలియని ఓ దేవుని గురించి ఈ మూవీ ఉంటుందని గతంలో పలు ఇంటర్వ్యూల్లో నాగవంశీ తెలిపారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కుమార స్వామిగా కనిపించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఆయన చేతిలో మురుగ బుక్ ఉన్న ఫోటో వైరల్ అయ్యింది. త్రివిక్రమ్ మూవీ కోసమే ఎన్టీఆర్ కుమార స్వామి జీవిత చరిత్ర గురించి తెలుకుంటున్నారని నెటిజన్లు కామెంట్స్ చేశారు.
Also Read: నాగార్జున అంత ఈజీగా ఒప్పుకోలేదు... 40 ఏళ్ళలో మొదటిసారి ఆ మాత్రం జాగ్రత్త ఉండొద్దూ!
ఎన్టీఆర్ ఎంట్రీ... మూవీకే హైలెట్
ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ 'వార్ 2' తెలుగు రైట్స్ నాగవంశీ చేతికి రాగా... ప్రస్తుతం ఆయన ప్రమోషన్స్ చేస్తున్నారు. 'వార్ 2'లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ మూవీకే హైలైట్‌గా నిలుస్తుందని... అది కూడా హృతిక్ తారక్‌ల ఫైట్ సీన్ అని చెప్పారు. 'ఇద్దరు స్టార్ హీరోలు తలపడితే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఆ ఒక్క సీన్ చూసే నేను ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. సినిమాలో ఎన్టీఆర్ కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే కనిపిస్తారనేది రూమర్. హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరికీ సమానమైన నిడివి ఉంది. సినిమా అంతా ఇద్దరూ కనిపిస్తారు.' అని వెల్లడించారు.
అతి త్వరలో వెంకటేష్ - త్రివిక్రమ్ మూవీ
ఆగస్టులో వెంకటేష్ త్రివిక్రమ్ మూవీ ప్రారంభం అవుతుందని నాగవంశీ తెలిపారు. ఈ మూవీకి 'వెంకటరమణ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' మూవీస్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూడో సినిమా ఇది. ఈ సినిమా కూడా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
విజయ్‌ను టార్గెట్ చేస్తున్నారు
యంగ్ హీరో విజయ్ దేవరకొండను నెటిజన్లు అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని... కారణం లేకుండానే అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని నాగవంశీ అన్నారు. ఆయన మాట్లాడింది వేరేలా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. విజయ్ 'కింగ్‌డమ్' మూవీ ఈ నెల 31న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.






















