Coolie: నాగార్జున అంత ఈజీగా ఒప్పుకోలేదు... 40 ఏళ్ళలో మొదటిసారి ఆ మాత్రం జాగ్రత్త ఉండొద్దూ!
Nagarjuna Role In Coolie Movie: 'కూలీ' సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అంత ఈజీగా ఆ వేషం వేసేందుకు ఒప్పుకోలేదట.

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కూలీ'లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వేషం వేసేందుకు ఆయన అంత ఈజీగా ఒప్పుకోలేదని దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెలిపారు.
రజనీతో ఈజీ... నాగార్జునకు ఎక్కువ టైమ్!
'కూలీ' సినిమాకు రజనీకాంత్ ఎస్ చెప్పడానికి ఎక్కువ టైం పట్టలేదని లోకేష్ కనగరాజ్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. తొలుత ఆయనతో ఒక ఫాంటసీ ఫిల్మ్ చేయాలని అనుకున్నా, అది సెట్స్ మీదకు వెళ్లడానికి ఏడాదిన్నర పడుతుందని 'కూలీ' కథ రాసినట్లు ఆయన వివరించారు. దీనికి రజనీ ఈజీగా ఒప్పుకొన్నారట. ఆయనది లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్ కాబట్టి ఎటువంటి కథ రాసిన సెట్ అవుతుందని పేర్కొన్నారు. అయితే 'కూలీ' విలన్ రోల్ వేసిన నాగార్జునను ఒప్పించడానికి ఎక్కువ సమయం పట్టిందన్నారు.
How Lokesh Kanagaraj convinced Nagarjuna for Coolie: నాగార్జునతో తన కన్వర్జేషన్ గురించి లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ... ''రజనీకాంత్ గారిని 'కూలీ' సినిమాకు ఎలా ఒప్పించానని నాగార్జున నన్ను అడిగారు. ఆయన కంటే మిమ్మల్ని ఒప్పించడానికి ఎక్కువ సమయం పట్టిందని చెప్పాను. తన 40 ఏళ్ల నట ప్రయాణంలో ఇటువంటి డైలాగులు (బ్యాడ్ వర్డ్స్) ఎప్పుడూ చెప్పలేదని నాగ్ సార్ అన్నారు. సినిమా చూసిన తర్వాత మీ కుటుంబ సభ్యులు ఏమంటారోనని అడిగా. వాళ్ళ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన కూడా చెప్పారు'' అని వివరించారు. నాగార్జునను ఒప్పించడం కోసం ఏడు ఎనిమిది సార్లు స్టోరీ మ్యారేజ్ చేశారట. నటుడిగా 40 ఏళ్లలో ఫస్ట్ టైమ్ విలన్ రోల్ చేయడం అంటే ఆమాత్రం జాగ్రత్త పడొద్దూ!
Also Read: 'కూలీ' సినిమాకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, తమిళ నటుడు సత్యరాజ్, కన్నడ స్టార్ ఉపేంద్ర తదితరులు 'కూలీ' కోసం అడిగిన వెంటనే ఒప్పుకొన్నారని లోకేష్ కనగరాజ్ తెలిపారు. ఆమిర్ ఖాన్ స్క్రీన్ టైమ్ తక్కువ ఉన్నప్పటికీ ఆయన ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందట. సైమన్ పాత్రలో నాగార్జున స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉంటుందని, ఇంపాక్ట్ కూడా అదే స్థాయిలో ఉంటుందని తెలిపారు.
Also Read: కూలీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా చూశాక సూపర్ స్టార్ ఏం చెప్పారంటే?





















