Mukesh Udeshi : సినీ పరిశ్రమలో మరో విషాదం - చిరంజీవి హిట్ సినిమాల నిర్మాత మృతి
ప్రముఖ నిర్మాత ముఖేష్ ఉద్దేశి కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
![Mukesh Udeshi : సినీ పరిశ్రమలో మరో విషాదం - చిరంజీవి హిట్ సినిమాల నిర్మాత మృతి Producer Mukesh Udeshi passed away due to kidney related disease Telugu news Mukesh Udeshi : సినీ పరిశ్రమలో మరో విషాదం - చిరంజీవి హిట్ సినిమాల నిర్మాత మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/12/8739b442ca692c57d3f57f1b92053ebc1694538484472686_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇటీవల కాలంలో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ముఖేష్ ఉద్దేశి కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రమే ఆయన మృతి చెందగా, ఈ విషయం ఈరోజు మంగళవారం బయటకు వచ్చింది.
కొన్ని రోజుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్.. ఇంతలోనే విషాదం
ముఖేష్ ఉద్దేశి గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. ఇటీవల ఆయన్ను కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో నిర్మాతకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాల్సి ఉందట. దీనికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సర్జరీ జరగక ముందే ఆయన మరణించడం ఇండస్ట్రీలో అందరినీ కలచివేస్తోంది. ముకేశ్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ముఖేష్ ఉద్దేశికి భార్య, కుమారుడు ఉన్నారు.
RIP #MukeshUdeshi Ji. Producer. A thorough gentleman. Kind. Very good company. Spent a lot of time with him in Mauritius. Huge loss to the industry. pic.twitter.com/xOnuH99Wqe
— kunal kohli (@kunalkohli) September 12, 2023
Also Read: 2024 క్లాష్ ఆఫ్ సీక్వెల్స్: 'ఇండియన్ 2', 'సింగం 3' లతో ఫైట్ కు రెడీ అంటున్న 'పుష్ప 2'
మెగాస్టార్ చిరంజీవితో హిందీలో హిట్ సినిమాలు..
ముఖేష్ ఉద్దేశి నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి కొన్ని సినిమాలను సంయుక్తంగా నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి హిందీలో నటించిన 'ప్రతిబంధ్', 'జెంటిల్ మెన్' చిత్రాల నిర్మాణంలో ముఖేష్ భాగం పంచుకున్నారు. తెలుగులో ‘ఎస్పీ పరశురాం’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయం అందించలేదు. ఇక హిందీలో 'కౌన్', 'కున్వారా, & 'కలకత్తా మెయిల్' వంటి పలు చిత్రాలను నిర్మించిన ఆయన, తర్వాతి రోజుల్లో లైన్ ప్రొడ్యూసర్ గా మారారు.
టాలీవుడ్ కు చెందిన దర్శకద్వయం రాజ్ & డీకే తెరకెక్కించిన ‘గో గోవా గాన్’ చిత్రానికి పని చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలానే 'ది షాకీన్స్', 'బ్రేక్ కే బాద్', ‘ఏక్ విలన్’, 'సారీ భాయ్', 'కిడ్నాప్', 'ప్యార్ మైన్ ట్విస్ట్' 'చష్మే బద్దూర్' వంటి బాలీవుడ్ సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఆయన ఎక్కువగా మారిషస్ లో చిత్రీకరించిన మూవీస్ కి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఆయన మరణం పట్ల పలువురు చలన చిత్రసీమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: తండ్రితో లిప్ లాక్ - 33 ఏళ్ల తర్వాత స్పందించిన ఆలియా భట్ అక్క!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)