అన్వేషించండి

తండ్రితో లిప్ లాక్ - 33 ఏళ్ల తర్వాత స్పందించిన ఆలియా భట్ అక్క!

మ్యాగజైన్ ఫోటో షూట్ లో భాగంగా తన తండ్రి మహేష్ భట్ కి లిప్ కిస్ ఇవ్వడంపై నటి పూజా భట్ తొలిసారిగా స్పందించింది.

బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. తన ఇద్దరు కుమార్తెలను హీరోయిన్లుగా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. మొదటి భార్యకు పుట్టిన పూజా భట్ కొన్నేళ్ల పాటు అగ్ర కథానాయికగా రాణించగా, సెకండ్ వైఫ్ కు జన్మించిన ఆలియా భట్ ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. అయితే దర్శకుడు మహేశ్‌ భట్‌ తన కూతురు పూజాతో కలిసి చేసిన ఓ ఫోటో షూట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇందులో తండ్రీ కూతుర్లు లిప్ లాక్ చేసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై మూడు దశాబ్దాల తర్వాత పూజా తొలిసారిగా నోరు విప్పింది.

పూజా భట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో 33 ఏళ్ల క్రితం తన తండ్రితో చేసిన ఫొటోషూట్‌ గురించి మాట్లాడింది. తండ్రిని ముద్దు పెట్టుకోవడం వల్ల ఆనాడు ఎదురైన ఇబ్బందులపై తొలిసారి స్పందించింది. మ్యాగజైన్ కవర్ పేజీ కోసం అలాంటి ఫోటో షూట్‌ లో పాల్గొన్నందుకు తాను ఏమాత్రం బాధపడటం లేదని తెలిపింది. తమ ఉద్దేశం మంచిదేనని.. కాకపోతే చూసేవాళ్లు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పూజా సమర్థించుకుంది.

‘‘అది చాలా మామూలు విషయం. కానీ ఆ ఫొటోలను కొంతమంది వేరేలా అర్థం చేసుకోవడం దురదృష్టకరం. తండ్రితో లిప్ కిస్ ఏంటి అని అప్పట్లో నాపై ఎన్నో విమర్శలు చేశారు. ఆ సమయంలో షారుఖ్‌ ఖాన్‌ చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. పిల్లలు చిన్నప్పుడు తమ తల్లిదండ్రులను ఇలాగే ముద్దు పెట్టుకుంటారు. పిల్లలు ఎంత పెద్దవాళ్లైనా తల్లిదండ్రులు వాళ్లను చిన్నవాళ్లగానే చూస్తారని ఆయన నాతో అన్నారు. నిజం చెప్పాలంటే ఈ వయసులోనూ నా తండ్రి నన్ను ఒక చిన్న పిల్లలాగే చూస్తారు’’ అని పూజా భట్ తెలిపింది.

ఇంకా మాట్లాడుతూ.. ‘‘ఆ ఫొటోషూట్‌ చేసినప్పుడు సమాజం గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. విషయం ఏదైనా సరే ప్రజలు తమకు నచ్చిన విధంగా చూస్తుంటారు. తండ్రీకుమార్తెల మధ్య అనుబంధాన్ని ప్రశ్నించే వాళ్లు ఏదైనా ఊహించుకుని కామెంట్స్‌ చేయగలరు. అలాంటి వారే మళ్లీ కుటుంబ విలువల గురించి మాట్లాడతారు. అదే అతి పెద్ద జోక్‌’’ అని పూజా చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

కాగా, 17 ఏళ్ల వయసులో 'డాడీ' సినిమాతో తెరంగేట్రం చేసిన పూజా భట్.. 'జునూన్' ‘సడక్‌’, ‘దిల్‌ హై కీ మంతా నహీ’ 'ప్రేమ్ దీవానే' వంటి చిత్రాల్లో నటించింది. వరుస విజయాలు సాధించి టీనేజ్ లోనే స్టార్‌ స్టేటస్ అందుకుంది. అయితే 24 ఏళ్లకే సినిమాలకు బ్రేక్ తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటూ వచ్చింది. 2020లో ‘సడక్‌ 2’ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ బ్యూటీ.. 'చుప్' చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ‘బాంబే బేగమ్స్‌’ అనే నెట్ ఫ్లిక్స్ సిరీస్ తో ఓటీటీలో అడుగుపెట్టింది. బిగ్ బాస్ OTT సీజన్ 2 లో పాల్గొని, టాప్-5 కంటెస్టంట్ గా నిలచింది. 

Also Read: 2024 క్లాష్ ఆఫ్ సీక్వెల్స్: 'ఇండియన్ 2', 'సింగం 3' లతో ఫైట్ కు రెడీ అంటున్న 'పుష్ప 2'

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget