అన్వేషించండి

Maheswara Reddy Mooli: 'శివం భజే'కు సీక్వెల్, తమిళ రీమేక్‌తో పాటు కొత్త సినిమాల గురించి నిర్మాత ఇంటర్వ్యూ

Shivam Bhaje Producer Interview: 'శివం భజే' సినిమాను ఒక్క జానర్‌కు పరిమితం చేయలేమని నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి చెబుతున్నారు. తాను శివ భక్తుడిని కనుక సినిమా చేయలేదని, కథ నచ్చి చేశానని చెప్పారు.

యువ కథానాయకుడు అశ్విన్ బాబు (Ashwin Babu) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శివం భజే' (Shivam Bhaje Movie). ఆగస్టు 1న థియేటర్లలో విడుదల అవుతోంది. విశేషం ఏమిటంటే... ఆ రోజు అశ్విన్ బాబు పుట్టిన రోజు. అంతే కాదు... గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, ఈ చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి బర్త్ డే కూడా ఆ రోజే. హీరోతో పాటు తన పుట్టిన రోజు కనుక ఆగస్టు 1న సినిమా విడుదల చేయడం లేదని, ఒక పంపిణీదారుడిగా ఆలోచించి థియేటర్లలోకి ఆ రోజు సినిమా తీసుకు వస్తున్నాయని తెలిపారు. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఆయన చెప్పిన విశేషాలు... 

ఐదు నిమిషాల్లో కథ ఓకే చేసిన అశ్విన్ బాబు!
Ashwin Babu agreed to do Shivam Bhaje within five minutes of narration: 'శివం భజే' కథను ముందు తాను విన్నానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత హీరో అశ్విన్ బాబు దగ్గరకు తీసుకు వెళ్లారనని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''నేను కథ విన్న వెంటనే అడ్వాన్స్ ఇచ్చా. అశ్విన్ దగ్గరకు తీసుకు వెళ్లగా... ఐదు నిమిషాల్లోనే సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఆయనకూ అంత నచ్చింది. ఆ విధంగా ఈ సినిమా మొదలు అయ్యింది'' అని అన్నారు. 

Shivam Bhaje Release Date: 'శివం భజే' కథను క్లుప్తంగా చెప్పలేమని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అలాగే, ప్రేక్షకుల విడుదలకు ముందు పూర్తిగా కథను రివీల్ చేయలేమన్నారు. ఇంకా మాట్లాడుతూ... ''ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ సినిమాను ఒక జానర్‌కు మాత్రమే పరిమితం చేయలేం. సినిమా చూస్తుంటే... ఓ ఐదారు జానర్లు కలిపినట్టు 'శివం భజే' ఉంటుంది. అయితే... ప్రేక్షకులు అందర్నీ ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. స్వతహాగా నేను శివ భక్తుడిని. అందుకని, ఈ సినిమా చేయలేదు. కథ నచ్చడంతో చేశా. ఆ కథను గురువారం (ఆగస్టు 1న) థియేటర్లలో చూస్తారు'' అని చెప్పారు. 

'హిడింబ' చూసి అశ్విన్ బాబును తీసుకున్నాం!
Shivam Bhaje Movie Hero Name: 'హిడింబ' సినిమా చూశాక అశ్విన్ బాబును హీరోగా తీసుకోవాలని అనుకున్నామని మహేశ్వర్ రెడ్డి వివరించారు. తెర మీద హీరో అశ్విన్ అయితే... తెర వెనుక హీరో సంగీత దర్శకుడు వికాస్ బడిస అన్నారు. ''మా సినిమాకు వికాస్ బడిస అద్భుతమైన పాటలతో పాటు నేపథ్య సంగీతం ఇచ్చాడు. కొన్ని సీన్లలో గూస్ బంప్స్ వచ్చేలా చేశారు'' అని చెప్పారు.

Also Readప్రభాస్ కోసం వెనక్కి తగ్గిన మంచు మనోజ్, తేజా సజ్జా - 'రాజా సాబ్' వెనుక 'మిరాయ్' రిలీజ్ డౌటే!


'శివం భజే' సినిమాను ఇప్పటి వరకు ఎవరికీ చూపించలేదని చెప్పారు మహేశ్వర్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ... ''విక్టరీ వెంకటేష్ గారు మా ట్రైలర్ చూసి బావుందని మెచ్చుకున్నారు. అంతే కానీ... మేం ఎవరికీ సినిమా చూపించలేదు. వెంకటేష్ గారితో అశ్విన్ బాబుకు క్రికెట్ వల్ల మంచి రిలేషన్ ఉంది. ట్రైలర్ చూసి ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. జూలై 31న అమెరికాలో ప్రీమియర్ షోలు వేస్తున్నాం. కంటెంట్ బావుంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకంతో సినిమా విడుదల చేస్తున్నాం. మున్ముందు భారీ సినిమాలు ఉన్నాయి కనుక ఇదే మంచి విడుదల తేదీ అనుకున్నాను'' అని చెప్పారు. 

కార్తికేయతో సినిమా ప్లానింగ్... నెక్స్ట్ మరొకటి!
'శివం భజే' తర్వాత 'ఐఐటీ కృష్ణమూర్తి' చిత్ర బృందంతో ఒక సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నానని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. యువ కథానాయకుడు కార్తికేయతో కూడా ఒక సినిమా చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. మంచి కథల కోసం తాను ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. 'శివం భజే'కు తెలుగులో విశేష ఆదరణ లభిస్తే తమిళంలో రీమేక్ చేసే ఆలోచన ఉందన్నారు. ఆల్రెడీ హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మేశామని, హిట్ అయితే రెండో పార్ట్‌ కూడా ప్లాన్ చేస్తామని చెప్పారు.

Also Readచిరు, పవన్, చరణ్ కోసం కథ రాస్తున్న దర్శకుడు - మెగా మల్టీస్టారర్ వర్కవుట్ అయ్యేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ఆస్పత్రిలో బాలుడిని పరామర్శించిన సీపీ, ఏం చెప్పారంటే?
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ఆస్పత్రిలో బాలుడిని పరామర్శించిన సీపీ, ఏం చెప్పారంటే?
Mufasa The Lion King: ముఫాసాకు నాన్న డబ్బింగ్ చెప్పడం గర్వంగా ఉంది... మహేష్ కుమార్తె సితార ఘట్టమనేని
ముఫాసాకు నాన్న డబ్బింగ్ చెప్పడం గర్వంగా ఉంది... మహేష్ కుమార్తె సితార ఘట్టమనేని
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

టీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్పార్లమెంంట్‌కి రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌లతో ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ఆస్పత్రిలో బాలుడిని పరామర్శించిన సీపీ, ఏం చెప్పారంటే?
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ఆస్పత్రిలో బాలుడిని పరామర్శించిన సీపీ, ఏం చెప్పారంటే?
Mufasa The Lion King: ముఫాసాకు నాన్న డబ్బింగ్ చెప్పడం గర్వంగా ఉంది... మహేష్ కుమార్తె సితార ఘట్టమనేని
ముఫాసాకు నాన్న డబ్బింగ్ చెప్పడం గర్వంగా ఉంది... మహేష్ కుమార్తె సితార ఘట్టమనేని
Allu Arjun Bail Cancel: సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
Kakinada Port Ship Seized: రేషన్ బియ్యం అన్‌లోడ్ చేశాకే, షిప్ రిలీజ్ చేయడంపై నిర్ణయం- కాకినాడ కలెక్టర్
రేషన్ బియ్యం అన్‌లోడ్ చేశాకే, షిప్ రిలీజ్ చేయడంపై నిర్ణయం- కాకినాడ కలెక్టర్
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
Social Media Fire: మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
Embed widget