Mirai Postponed?: ప్రభాస్ కోసం వెనక్కి తగ్గిన మంచు మనోజ్, తేజా సజ్జా - 'రాజా సాబ్' వెనుక 'మిరాయ్' రిలీజ్ డౌటే!
Raja Saab Effect On Mirai: ప్రభాస్ 'రాజా సాబ్'ను ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ ఎఫెక్ట్ తేజా సజ్జా 'మిరాయ్' మీద పడేటట్లు ఉంది. ఆ సినిమా వాయిదా పడే ఛాన్సులు ఉన్నాయి.
'ది రాజా సాబ్' (The Raja Saab Movie) ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ విడుదల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ. డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. అయితే... తేజా సజ్జా 'మిరాయ్' టీమ్ (Mirai Movie) మాత్రం సంతోషంగా ఉండే అవకాశాలు తక్కువ. ఎందుకంటే... తమ ముందుకు రెబల్ స్టార్ వచ్చాడు కనుక! దాంతో ఆ సినిమా వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఏప్రిల్ 18న 'మిరాయ్'ను విడుదల అవుతుందా?
పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'హనుమాన్' తర్వాత తేజా సజ్జా (Teja Sajja) హీరోగా రూపొందుతున్న సినిమా 'మిరాయ్'. ఇందులో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 18న పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. చాలా రోజుల క్రితం ఆ విడుదల తేదీ కూడా అనౌన్స్ చేశారు. అయితే... ఇప్పుడు ప్రభాస్ 'రాజా సాబ్'ను ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
ప్రభాస్ సినిమా అంటే బాక్సాఫీస్ బరిలో మినిమమ్ మూడు నాలుగు వారాలు జోష్ ఉంటుంది. అందులోనూ 'సలార్', 'కల్కి 2898 ఏడీ' తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా కనుక 'రాజా సాబ్' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లింప్స్ విడుదలైన తర్వాత ఆ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో 'రాజా సాబ్' విడుదలైన వారం తర్వాత 'మిరాయ్' థియేటర్లలోకి వస్తుందా? వచ్చే సాహసం చేస్తుందా? అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏమీ కాదు. విడుదల వాయిదా పడటం గ్యారెంటీ అని ఫిల్మ్ నగర్ వర్గాలు సైతం బలంగా ఫిక్స్ అయ్యాయి. ఎందుకు అంటే...
రెండిటి నిర్మాత ఒక్కరే... అది అసలు పాయింట్!
ప్రభాస్ 'ది రాజా సాబ్', మంచు మనోజ్ & తేజా సజ్జాల 'మిరాయ్'... ఈ రెండు సినిమాలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) ప్రొడ్యూస్ చేస్తున్నారు. వారం వ్యవధిలో రెండు పాన్ ఇండియా సినిమాలను విడుదల చేయడం వల్ల ఆయనకు నష్టం ఎక్కువ, లాభం తక్కువ. ప్రభాస్ సినిమా 'రాజా సాబ్' కోసం 'మిరాయ్'ను వాయిదా వేయడానికి రెడీ అయ్యారని టాక్.
Also Read: చిరు, పవన్, చరణ్ కోసం కథ రాస్తున్న దర్శకుడు - మెగా మల్టీస్టారర్ వర్కవుట్ అయ్యేనా?
'హనుమాన్' విడుదల సమయంలో థియేటర్ల గురించి పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అందుకే, ఈసారి విడుదల తేదీ ముందుగా అనౌన్స్ చేశాడు తేజా సజ్జా. కానీ, రెబల్ స్టార్ సినిమా మోసం త్యాగం చేయక తప్పడం లేదు. ఏప్రిల్ 18 నుంచి 'మిరాయ్' వెనక్కి వెళుతుందా? లేదంటే ముందుకు వస్తుందా? అనేది చూడాలి. ఆ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో 'ఈగల్' తీశారు.
Also Read: 'మిస్టర్ బచ్చన్'లో ఒరిజినల్ రవితేజ - ఆ రోల్, మూవీపై దర్శకుడు హరీష్ శంకర్ రివ్యూ ఏమిటంటే?