SSMB29 Update : విలన్ 'కుంభ' ఓకే... నెక్స్ట్ ప్రియాంక చోప్రా - 'SSMB29' నుంచి మరో సర్‌ప్రైజ్ ఎప్పుడంటే?
Priyanka Chopra : SSMB29 నుంచి మరో సర్ ప్రైజ్ ఇచ్చేందుకు దర్శక ధీరుడు రాజమౌళి రెడీ అవుతున్నారు. మహేష్ బాబు ఫస్ట్ లుక్ ఈవెంట్ కంటే ముందే ప్రియాంక చోప్రా లుక్ రివీల్ చేయనున్నారు.

Rajamouli Plans To Release Priyanka Chopra Look From SSMB29 Before Mahesh Babu Surprise : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న 'SSMB29' నుంచి బిగ్ అప్డేట్ ఈ నెల 15న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు బిగ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి అండ్ టీం. అంతకు ముందు ఒక్కొక్కటి స్పెషల్ సర్‌ప్రైజెస్ రిలీజ్ చేస్తున్నారు.
ప్రియాంక చోప్రా లుక్
ఈ మూవీలో ఇప్పటికే విలన్ 'కుంభ'ను పరిచయం చేస్తూ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు రాజమౌళి. రోబోటిక్ హ్యాండ్స్ ఉన్న వీల్ చైర్‌లో అంగవైకల్యం ఉన్న పవర్ ఫుల్ పాత్రలో ఉన్న పృథ్వీ లుక్ ట్రెండ్ అవుతోంది. ఇక నెక్స్ట్ ప్రియాంక చోప్రా లుక్ రివీల్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ప్రియాంక రోల్‌ను ఈ నెల 11న రిలీజ్ చేయనున్నారట.
మరోవైపు... హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 15న బిగ్గెస్ట్ ఈవెంట్ జరగనుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. 'అప్డేట్/ఈవెంట్ ఎప్పుడెప్పుడు అని కొన్ని నెలల నుంచి అడుగుతున్నారు. టైం ఆసన్నమైంది. Globe Trotter ఈవెంట్ ఈ నెల 15న ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.' అంటూ చెప్పారు.
View this post on Instagram
Also Read : దళపతి విజయ్ లాస్ట్ మూవీ 'జన నాయగన్' - బాలయ్య 'భగవంత్ కేసరి'కి రీమేకా!... ఫస్ట్ సాంగ్‌తో...
'కుంభ'పై ట్రోలింగ్స్...
రాజమౌళి మూవీలో విలన్ అంటేనే స్పెషల్. 'మగధీర' మూవీ నుంచి మొన్నటి 'RRR' వరకూ అది చూశాం. మహేష్ బాబు 'SSMB29'లోనూ విలన్ రోల్ ఫస్ట్ లుక్ కూడా అంతే ట్రెండ్ అవుతోంది. అయితే, ఈ లుక్‌పై ట్రోలింగ్స్ కూడా అంతే స్థాయిలో వస్తున్నాయి. ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు సూర్య '24' మూవీలో 'ఆత్రేయ' రోల్ గుర్తు చేసుకుంటున్నారు. అలాగే, 'క్రిష్ 3'లో వివేక్ ఒబెరాయ్ 'కాల్' రోల్‌ను పోలి ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం రాజమౌళిని తక్కువ అంచనా వెయ్యొద్దని... ఒక్క ఫ్రేమ్‌తోనే సినిమా మొత్తం మారిపోతుందని అంటున్నారు.
'కుంభ'కు 'వారణాసి'కి లింక్ ఏంటి?
ఈ మూవీ టైటిల్ 'వారణాసి' అని ఫిక్స్ చేస్తారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో 'కుంభ'కు, వారణాసికి లింక్ ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. హీరో మహేష్ బాబు పాత్ర హనుమంతుడిని పోలి ఉంటుందనే ప్రచారం సాగుతుండగా... రామాయణంలో సుగ్రీవుడి పిడిగుద్దులతో కుంభకర్ణుడి కుమారుడు కుంభుడు మరణిస్తాడు. ఇక సంజీవని అన్వేషణలో సాహస యాత్ర సాగించే హీరో 'కుంభ'ను ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే స్టోరీ అనే టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.





















