Priya Anand: నిత్యానందతో పెళ్ళా? ప్రియా ఆనంద్ మాటతో షాక్‌లో ప్రేక్షకులు
వివాదాస్పద స్వామిజీ నిత్యానంద తెలియని దక్షిణాది ప్రజలు ఉండరేమో! ఆయన రాసలీలల వీడియో అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన్ను పెళ్ళాడాలని ఉందని ప్రియా ఆనంద్ చెప్పడం చర్చనీయాంశం అయ్యింది.
కథానాయిక ప్రియా ఆనంద్ గుర్తు ఉన్నారు కదా! తెలుగులో రానా దగ్గుబాటి 'లీడర్' సినిమాలో ఓ నాయికగా నటించారు. ఆ తర్వాత రామ్ పోతినేని 'రామ రామ కృష్ణ కృష్ణ', సిద్ధార్థ్ '180', శర్వానంద్ 'కో అంటే కోటి' సినిమాల్లో నటించారు. ఈ నెల 15 నుంచి జీ 5 ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానున్న 'మా నీళ్ల ట్యాంక్' వెబ్ సిరీస్‌తో కొంత విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
వెబ్ సిరీస్‌లు, సినిమాలతో కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రియా ఆనంద్ వార్తల్లో నిలిచారు. వివాదాస్పద స్వామీజీ, ఆధ్యాత్మిక గురు నిత్యానంద తెలియని దక్షిణాది ప్రజలు ఉండరేమో! ఆయన రాసలీలల వీడియో అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన ఉత్తరాదిలో కూడా ఫేమస్ అయ్యారు. అటువంటి స్వామీజీని పెళ్ళాడాలని ఉందని ప్రియా ఆనంద్ చెప్పడంతో ప్రజలు షాక్‌కి గురయ్యారు. ఇప్పుడు ఆమె మాటలు చర్చనీయాంశం అయ్యింది.
ప్రియా ఆనంద్ కొన్ని రోజుల నుంచి నిత్యానంద సూక్తులు, వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో వాటి గురించి ప్రశ్నించగా ''నిత్యానంద అంటే నాకు ఇష్టం. ఆయనపై విమర్శలు వచ్చినప్పటికీ... ఎంతో మందిని ఆకట్టుకున్నారు. వీలైతే ఆయన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది'' అని ప్రియా ఆనంద్ సమాధానం ఇచ్చారు.
Also Read : నాగార్జున ఊచకోత మామూలుగా లేదుగా - దసరాకు థియేటర్లలోకి 'ఘోస్ట్'గా వస్తున్న కింగ్
ఒకవేళ నిత్యానంద స్వామీజీని పెళ్లి చేసుకుంటే తన పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని... తమ ఇద్దరి పేర్లు దగ్గరగా ఉంటాయని ప్రియా ఆనంద్ చెప్పడం గమనార్హం. నిత్యానంద మీద లైంగిక ఆరోపణలు కూడా వచ్చాయి. అటువంటి స్వామీజీని పెళ్ళాడాలని ఉందని ప్రియా ఆనంద్ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అదీ సంగతి!
View this post on Instagram