అన్వేషించండి

Salaar : ప్రముఖ టీవీ ఛానెల్ లో 'సలార్' - టెలికాస్ట్ ఎప్పుడంటే?

Salaar Movie: ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' మూవీ బుల్లితెరపై సందడి చేయబోతోంది. ఏప్రిల్ 21న స్టార్ మా ఛానెల్ లో ఈ సినిమా టెలికాస్ట్ కానుంది.

Salaar seals its world television premiere : పాన్ ఇండియా హీరో ప్రభాస్, 'కేజిఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన 'సలార్' గత ఏడాది చివర్లో విడుదలై మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. 'బాహుబలి' తర్వాత వరుస అపజయాలతో సతమతమవుతున్న ప్రభాస్ కి 'సలార్' మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. రీసెంట్గా ఓటీటీ లోనూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న 'సలార్' ఇప్పుడు టీవీల్లోకి రాబోతోంది.

'సలార్' టీవీల్లోకి వచ్చేస్తుంది

'సలార్' మూవీ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా భారీ ధరకు కొనుగోలు చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ స్టార్ మా ఛానెల్ లో ఏప్రిల్ 21 ఆదివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ కానుంది. కాగా థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజులలోపే ఓటీటీ లోకి వచ్చేసిన ఈ సినిమా టీవీల్లోకి మాత్రం రిలీజ్ అయిన నాలుగు నెలలకి దర్శనం ఇవ్వబోతోంది. మరి బుల్లితెర పై 'సలార్' ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉన్న 'సలార్'

ప్రస్తుతం 'సలార్' మూవీ నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ వెర్షన్స్ స్ట్రీమింగ్ అవుతుండగా.. హిందీ వెర్షన్ మాత్రం డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. 'సలార్' హిందీ వెర్షన్ చాలా ఆలస్యంగా రిలీజ్ చేశారు. దీని కంటే ముందు రిలీజ్ చేసిన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్స్ కి ఓటీటీలో మంచి వ్యూస్ వచ్చాయి. ఇక సలార్ ఇంగ్లీష్ వెర్షన్ కి సైతం డిమాండ్ రావడంతో మేకర్స్ ఓటీటీ లో ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ చేయగా.. దానికి ఎవరూ ఊహించని విధంగా భారీ రెస్పాన్స్ వచ్చింది.

'సలార్ 2' సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడు?

'సలార్' క్లైమాక్స్ లో ప్రాణ స్నేహితులైన దేవ, వరదరాజ మన్నార్‌ మధ్య యుద్ధం కూడా రెండో భాగంలో ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. దీంతో 'సలార్ పార్ట్-2' ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పార్ట్ 2పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. కాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 'సలార్ 2' కోసం అంత సిద్ధం చేశారట. లీడ్ రోల్స్ లో నటించే యాక్టర్స్ కాల్ షీట్స్ సైతం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది 'సలార్ 2'ని సెట్స్ పైకి తీసుకెళ్లి అదే ఏడాది ప్రేక్షకుల ముందు తీసుకురావాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 'సలార్' సినిమాని హోంబలే నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమాలో ప్రభాస్ తో పాటూ మళయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, శ్రీయా రెడ్డి, బాబీ సింహా, ఈశ్వరీ రావ్, టినూ ఆనంద్ తదితరులు కీలకపాత్రలో నటించారు. రవి బాస్రూర్ సంగీతం అందించారు.

Also Read : పుష్పరాజ్ పేరిట నయా రికార్డ్ - మరో అరుదైన ఘనత సాధించిన 'పుష్ప 2' టీజర్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nikhil Siddhartha : 6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
Kantata Kishore : మీ తప్పులకు ఇంకెంత మూల్యం చెల్లించుకోవాలి? - ప్రధాని మోదీపై కాంతార నటుడు ఫైర్
మీ తప్పులకు ఇంకెంత మూల్యం చెల్లించుకోవాలి? - ప్రధాని మోదీపై కాంతార నటుడు ఫైర్
Ranveer Singh : చాముండి టెంపుల్ దర్శించి సారీ చెబుతా - కాంతార దేవతలపై కామెంట్స్ కాంట్రవర్సీ... ధురంధర్ హీరో ఏమన్నారంటే?
చాముండి టెంపుల్ దర్శించి సారీ చెబుతా - కాంతార దేవతలపై కామెంట్స్ కాంట్రవర్సీ... ధురంధర్ హీరో ఏమన్నారంటే?
Nagabandham Release Date : మైథలాజికల్ ఎపిక్ నాగబంధం రిలీజ్ డేట్ ఫిక్స్ - పాన్ ఇండియా స్థాయిలో వచ్చేది ఎప్పుడంటే?
మైథలాజికల్ ఎపిక్ నాగబంధం రిలీజ్ డేట్ ఫిక్స్ - పాన్ ఇండియా స్థాయిలో వచ్చేది ఎప్పుడంటే?

వీడియోలు

Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam
Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
TVS Bikes 2026: టీవీఎస్‌లో సామాన్యుడి బడ్జెట్ నుంచి రేసింగ్ ట్రాక్ వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరల వివరాలు ఇవే?
టీవీఎస్‌లో సామాన్యుడి బడ్జెట్ నుంచి రేసింగ్ ట్రాక్ వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరల వివరాలు ఇవే?
Nikhil Siddhartha : 6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
LPG Connection: ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
Ranveer Singh : చాముండి టెంపుల్ దర్శించి సారీ చెబుతా - కాంతార దేవతలపై కామెంట్స్ కాంట్రవర్సీ... ధురంధర్ హీరో ఏమన్నారంటే?
చాముండి టెంపుల్ దర్శించి సారీ చెబుతా - కాంతార దేవతలపై కామెంట్స్ కాంట్రవర్సీ... ధురంధర్ హీరో ఏమన్నారంటే?
Hyderabad Chicken Shops Close: హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Embed widget