అన్వేషించండి

Pushpa 2 Teaser : పుష్పరాజ్ పేరిట నయా రికార్డ్ - మరో అరుదైన ఘనత సాధించిన 'పుష్ప 2' టీజర్!

Pushpa Movie Teaser: అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ టీజర్ తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది. ఈ టీజర్ ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్ ట్రెండింగ్ లో నిలిచిందని మేకర్స్ అధికారికంగా తెలిపారు.

Pushpa 2 creates a sensational record : టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' నుంచి రీసెంట్ గా బన్నీ బర్త్ డే కి టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కేవలం నిమిషం ఐదు సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ రికార్డుల తాటతీస్తోంది. ముఖ్యంగా టీజర్ లో అల్లు అర్జున్ చీరకట్టుతో అమ్మోరు గెటప్ లో కనిపించి గూస్ బంప్స్ తెప్పించాడు. దీంతో ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కి టీజర్ విపరీతంగా నచ్చేసింది. ఫలితంగా ఈ టీజర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే వ్యూస్, లైక్స్ పరంగా అదరగొట్టిన 'పుష్ప 2' టీజర్ ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది.

యూట్యూబ్ లో 138 గంటల పాటూ నంబర్ వన్ స్థానంలో..

'పుష్ప 2' టీజర్ ఇప్పటికే భారీ వ్యూస్ అండ్ లైక్స్ ని సాధించింది. అది తక్కువ టైంలో 110 మిలియన్ల వ్యూస్ ని, 1.55 మిలియన్ల లైక్స్ ని అందుకున్న ఈ టీజర్ గా రికార్డు నెలకొల్పింది.  అయితే తాజాగా మరో సరికొత్త రికార్డు సెట్ చేసింది 'పుష్ప 2' టీజర్.  ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్ లో నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ లో రన్ అవుతున్న ఏకైక టీజర్ గా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. యూట్యూబ్లో 138 గంటల పాటూ ట్రెండింగ్ నంబర్ వన్ లో నిలిచిందనే విషయాన్ని మేకర్స్ ఇలా అధికారికంగా తెలియజేయడంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


భారీ ధరకు ఆడియా రైట్స్

'పుష్ప: ది రైజ్' సినిమా పాటలు వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో 'పుష్ప2' ఆల్బమ్ పై మరిన్ని అంచనాలను నెలకొన్నాయి. దానికి తగ్గట్లుగానే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా 'పుష్ప 2' ఆడియో రైట్స్ ని ప్రముఖ మ్యూజిక్ సంస్థ టి సిరీస్ భారీ ధరకు కొనుగోలు చేసింది. 'పుష్ప 2' అన్ని భాషల మ్యూజిక్ రైట్స్ ని టి సిరీస్ ఏకంగా 60 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు మరే స్టార్ హీరో సినిమా మ్యూజిక్ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడుపోయిన దాఖలాలు లేవు. అది కేవలం 'పుష్ప 2' సినిమాకి మాత్రమే సాధ్యమైంది.

100 కోట్లకు ఓటీటీ రైట్స్

'పుష్ప 2' ఆడియో రైట్ మాత్రమే కాదు ఓటీటీ రైట్స్ సైతం భారీ ధర పలికినట్లు తెలిసింది. పుష్ప: ది రైజ్ మూవీని ఆమెజాన్ ప్రైమ్ 30 కోట్లకు కొనుగోలు చేస్తే.. ప్రస్తుతం 'పుష్ప 2' ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 100 కోట్లకు కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తోంది. అయితే చిత్ర బృందం నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ సుమారు రూ.300 కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న తో పాటు ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగపతిబాబు, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : నా సినిమా గురించి అలా మాట్లాడిన వాళ్లే 'యానిమల్' సినిమాని చూస్తారు, ఇది సిగ్గు చేటు - సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
Vijay Deverakonda : నా మూవీస్‌కు టికెట్ రేట్స్ పెరగవు - సత్యసాయి బయోపిక్‌ చేయాలనుకున్నా... విజయ్ దేవరకొండ రియాక్షన్
నా మూవీస్‌కు టికెట్ రేట్స్ పెరగవు - సత్యసాయి బయోపిక్‌ చేయాలనుకున్నా... విజయ్ దేవరకొండ రియాక్షన్
Sunday OTT Movies : ఆదివారం ఓటీటీల్లో సినిమాల సందడి - వీకెండ్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్... 150 కోట్ల మూవీ డోంట్ మిస్
ఆదివారం ఓటీటీల్లో సినిమాల సందడి - వీకెండ్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్... 150 కోట్ల మూవీ డోంట్ మిస్
Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget