అన్వేషించండి

Siddharth : నా సినిమా గురించి అలా మాట్లాడిన వాళ్లే 'యానిమల్' సినిమాని చూస్తారు, ఇది సిగ్గు చేటు - సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు

Siddharth: హీరో సిద్ధార్థ్ తాజాగా ఓ ఈవెంట్లో 'చిన్నా' సినిమా గురించి కొందరు మగవాళ్ళు చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుతూ అదే క్రమంలో 'యానిమల్' మూవీపై విమర్శలు చేశాడు.

Siddharth Comments On Animal Movie : తెలుగులో ఒకప్పుడు భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ గత ఏడాది 'చిన్నా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదట తమిళంలో 'చిత్తా' పేరుతో రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత తెలుగులో 'చిన్నా' పేరుతో రిలీజ్ అయ్యింది. తమిళంలో వచ్చినంత రెస్పాన్స్ తెలుగులో ఈ సినిమాకు రాలేదు. కమర్షియల్ గానూ అనుకున్న విధంగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ చిన్నపిల్లల మీద లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే ఈ సినిమాని అందరూ చూసి తట్టుకోలేరనే అభిప్రాయాలు మాత్రం వ్యక్తం అయ్యాయి. అయితే తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన సిద్ధార్థ్ తన సినిమాపై వచ్చిన కామెంట్స్ గురించి స్పందించాడు. ఈ క్రమంలోనే 'యానిమల్' మూవీపై విమర్శలు గుప్పించాడు.

'చిన్నా' సినిమా వాళ్లకు డిస్టర్బింగ్ గా అనిపించిందట

హీరో సిద్ధార్థ్ స్టేజ్ ల  పై కానీ ఇంటర్వ్యూలో గాని మాట్లాడేటప్పుడు ఓపెన్ గానే ఉంటాడు. ఎవరి మీదైనా కౌంటర్లు వేయాలన్నా అసలు వెనకాడడు. బాధ వస్తే అందరి ముందే ఏడ్చేస్తాడు. అలా 'చిన్నా' సినిమాను తెలుగులో రిలీజ్ చేద్దామంటే థియేటర్స్ దొరకలేదంటూ స్టేజ్ మీదే ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.  తాజాగా ఓ ఈవెంట్ కి హాజరైన సిద్ధార్థ్ 'చిన్న' సినిమాపై వచ్చిన కామెంట్స్ గురించి మాట్లాడుతూ.." చిన్నా సినిమాని చూడడం కష్టమని ఒక్క మహిళ కూడా నాతో కానీ డైరెక్టర్ అరుణ్ తో గాని చెప్పలేదు. కానీ మగవాళ్ళు మాత్రం చాలా మంది ఈ సినిమా చూసి తట్టుకోవడం కష్టమని అన్నారు. నా సినిమా విషయంలో ఇలా మాట్లాడిన వాళ్లే మృగం అనే సినిమాను మాత్రం చూస్తారు. కానీ వాళ్లకు 'చిన్నా' సినిమా మాత్రం డిస్టర్బింగ్ గా అనిపిస్తుందట. ఇలాంటి సినిమాని చూసి డిస్టర్బింగ్ గా ఉందని అనడం సిగ్గుచేటు. ఈ విషయంలో త్వరలోనే ప్రేక్షకులు మారతారని ఆశిస్తున్నా" అని అన్నాడు.

'యానిమల్' ని ఉద్దేశిస్తూ..

సిద్ధార్థ్ తన సినిమా గురించి మాట్లాడిన వాళ్లు 'మృగం' అనే సినిమాను చూస్తారని తమిళంలో చెప్పాడు. నిజానికి అతను కౌంటర్ వేసింది 'యానిమల్' మూవీ గురించేనా అనిపిస్తుంది. సిద్ధార్థ్ ఈ ఈవెంట్ లో 'యానిమల్' అని డైరెక్ట్ గా చెప్పకుండా తమిళంలో మృగం అనే పేరుతో 'యానిమల్' పై విమర్శలు చేశాడు. 'యానిమల్' మూవీని వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు విమర్శించగా.. ఇప్పుడు ఆ లిస్ట్ లో సిద్ధార్థ్ కూడా చేరాడు .

అదితి రావ్ హైదరితో నిశ్చితార్థం

సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ గత కొంతకాలంగా రిలేషన్షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు సైతం వినిపించాయి. ఇదే విషయంపై ఓ అవార్డు ఫంక్షన్ లో సిద్ధార్థ్ స్పందిస్తూ.." మేము రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని అంటున్నారు. నిజానికి సీక్రెట్‌, ప్రైవేట్‌ అనే పదాలకు నా దృష్టిలో చాలా వ్యత్యాసం ఉంది. మాది పెద్దల సమక్షంలో జరిగిన ప్రైవేట్‌ ఫంక్షన్‌. మా నిశ్చితార్థానికి ఎవరినైతే పిలవలేదో వారు ఇది సీక్రెట్‌ అని అంటున్నారు. ఇవన్ని నేను పట్టించుకోను. మాది షూటింగ్‌ డేట్‌ కాదు, లైఫ్ టైమ్ డేట్‌. పెద్దల నిర్ణయం ప్రకారమే మా పెళ్లి జరుగుతుంది" అని అన్నాడు.

Also Read : నేను బాగున్నాను, ఎవరూ టెన్షన్ పడకండి, మళ్లీ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తా: షాయాజీ షిండే

టాప్ హెడ్ లైన్స్

Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget