అన్వేషించండి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగాకు ఫాల్కే అవార్డు - సెటైర్ వేసిన హీరోయిన్!

విమర్శకులకు అతీతంగా 'యానిమల్' సినిమా వసూళ్లు సాధించింది. అవార్డులు కూడా వస్తున్నాయి. అయితే, సందీప్ రెడ్డి వంగాకు దాదాసాహెబ్ ఫాల్కే ఐఎఫ్ఎఫ్ అవార్డు రావడం పట్ల ఓ హీరోయిన్ సెటైర్ వేశారు.

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన 'యానిమల్' బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. సుమారు 900 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని ఓ అంచనా. వసూళ్లతో పాటు సినిమాపై విమర్శలు సైతం అదే స్థాయిలో వచ్చాయి. అవార్డుల విషయంలో కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగాను ఉత్తమ దర్శకుడు పురస్కారంతో దాదాసాహెబ్ ఫాల్కే ఐఎఫ్ఎఫ్ నిర్వాహకులు సత్కరించారు. ఆయనకు అవార్డు రావడం పట్ల సోషల్ మీడియా వేదికగా ఓ హీరోయిన్ అసహనం వ్యక్తం చేశారు. అతడిపై సెటైర్ వేశారు. ఇంతకీ, ఆ హీరోయిన్ ఎవరు? ఏమన్నారు? వంటి వివరాల్లోకి వెళితే... 

మహిళా ద్వేషికి అవార్డు వచ్చిందట!
''మిసోజినీ (మహిళల పట్ల ద్వేషం వ్యక్తం చేసే వ్యక్తి)కి అవార్డుకు వచ్చిందని విన్నా. దీనిపై కేవలం 'యానిమల్స్' మాత్రమే నిర్ణయం తీసుకోగలవు. ఇది ప్రమాదానికి సంకేతం'' - ఇదీ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ హీరోయిన్ చేసిన పోస్ట్. ఆ స్క్రీన్ షాట్ కింద చూడవచ్చు.

Also Read: ఆస్కార్స్‌ అవార్డుల్లో 13 నామినేషన్స్... బాఫ్టాలో 7 అవార్డ్స్... హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగాకు ఫాల్కే అవార్డు - సెటైర్ వేసిన హీరోయిన్! 
'యానిమల్'కు గాను సందీప్ రెడ్డి వంగాకి దాదాసాహెబ్ ఫాల్కే ఐఎఫ్ఎఫ్ అవార్డు వచ్చిన సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ హీరోయిన్ పేరు పూనమ్ కౌర్. నాగార్జున 'గగనం', వెంకటేష్ 'నాగవల్లి', పవన్ కళ్యాణ్ 'జల్సా', గోపీచంద్ 'శౌర్యం', రామ్ పోతినేని 'గణేష్', నితిన్ 'శ్రీనివాస కళ్యాణం' సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేసిన అమ్మాయి. 'వినాయకుడు' సినిమాలో హీరోయిన్. సందీప్ రెడ్డికి అవార్డు ఇచ్చిన వాళ్ళను కూడా జంతువులతో పోల్చారు ఆమె. ప్రస్తుతం పూనమ్ కౌర్ చేతిలో సినిమాల ఏవీ లేవు. సెలబ్రిటీలపై విమర్శలు చేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో కనిపిస్తున్నారు.

Also Readప్రభాస్ సినిమా నుంచి తీసేశారు... పవన్‌ కళ్యాణ్‌తో అసలు నటించలేదు... రకుల్ టాలీవుడ్ జర్నీలో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్!

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగాకు ఫాల్కే అవార్డు - సెటైర్ వేసిన హీరోయిన్!

'యానిమల్' సినిమాకు కొందరి నుంచి ప్రశంసలు వచ్చాయి. మరికొందరి నుంచి విమర్శలు వచ్చాయి. అయితే, ప్రేక్షకులు వాటిని పట్టించుకోలేదు. సినిమాను ఆదరించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ అందుకున్న 'యానిమల్'కు ఓటీటీలో సైతం అదే ఆదరణ లభించింది. అయినా సరే విమర్శలు ఆగలేదు. 'యానిమల్' సినిమాకు ఫిలిం ఫేర్ అవార్డుల్లో సందీప్ రెడ్డి వంగాకు నామినేషన్ లభించింది. కానీ, అవార్డు రాలేదు. సినిమాలో హీరోగా నటించిన రణబీర్ కపూర్, సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ సహా పలువురు అవార్డులు అందుకున్నారు. 

ప్రముఖ హిందీ రచయిత జావేద్ అక్తర్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సహా పలువురు హిందీ సినిమా ప్రముఖులు 'యానిమల్' సినిమాపై విమర్శలు చేశారు. వాళ్లందరికీ సందీప్ రెడ్డి వంగా గట్టిగా సమాధానం చెప్పారు. బాలీవుడ్ క్రిటిక్స్ కొందరు 'యానిమల్' మీద విమర్శలు చేశారు. వాళ్లకు కలెక్షన్స్ ట్యాగ్ చేసింది మూవీ టీమ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'మిమ్మల్ని సినిమాలు తీయనివ్వమని కొందరు అంటున్నారు' అని సందీప్ రెడ్డి వంగాతో చెప్పగా... ''ఇండియాలో నన్ను సినిమాలు తీయనివ్వకపోతే హాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సినిమాలు తీస్తా'' అని సమాధానం ఇచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Embed widget