అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ను వీడ‌ని స‌మ‌స్య‌లు, మూవీ బడ్జెట్‌పై తప్పుడు లెక్కలు - నిర్మాతలపై పోలీసులు కేసు

Manjummel Boys: మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా సూప‌ర్ హిట్ అయిన సినిమా ‘మంజుమ్మెల్ బాయ్స్’. ఈ సినిమాని స‌మ‌స్య‌లు మాత్రం వ‌ద‌ల‌టం లేదు. ప్రొడ్యూస‌ర్లు ఛీటింగ్ చేసిన‌ట్లు తేలిందంటున్నారు పోలీసులు.

police report against Manjummel Boys producers: మ‌ల‌యాళంలో మాత్ర‌మే కాకుండా తెలుగులో కూడా సూప‌ర్ హిట్ అయిన సినిమా ‘మంజుమ్మెల్ బాయ్స్’. ఈ సినిమా హిట్ టాక్ అందుకున్న ద‌గ్గ‌ర నుంచి ఏదో ఒక చిక్కుల్లో ప‌డుతూనే ఉంది. ఎర్నాకులం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస‌ర్ల‌పై కేసు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ కేసుకు సంబంధించి విచార‌ణ వేగ‌వంతం చేశారు పోలీసులు. దానికి సంబంధించి రిపోర్ట్ ను కోర్టులో స‌బ్మిట్ చేశారు. ఉద్దేశపూర్వ‌కంగానే ప్రొడ్యూస‌ర్లు మోసం చేసిన‌ట్లు రిపోర్ట్ లో వెల్ల‌డించారు పోలీసులు. 

కేసు ఏంటంటే? 

ఆరూర్‌కు చెందిన పిటీష‌నర్ సిరాజ్ వలియతర ‘మంజుమ్మెల్ బాయ్స్’ ప్రొడ్యూస‌ర్ల‌పై కేసు ఫైల్ చేశారు. పరావా ఫిలిమ్స్, షాన్ ఆంటోనీ కలిసి ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాకు వచ్చే లాభాల్లో 40 శాతం షేర్ ఇస్తానని సిరాజ్ వలియతరకు మాటిచ్చారు. దానికిగాను ఆయ‌న రూ.7 కోట్లు సినిమాలో పెట్టుబ‌డి పెట్టాడు. అయితే, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి స‌క్సెస్ అయిన త‌ర్వాత వాటా ఇవ్వ‌కుండా మోసం చేశార‌ని, త‌ను పెట్టుబ‌డిగా పెట్టిన ఏడు కోట్ల రూపాయ‌లు కూడా ఇవ్వ‌లేద‌ని ఆరోపించారు. పరావా ఫిల్మ్స్, షాన్ ఆంటోనీ మీద సిరాజ్ కోర్టులో కేసు వేశారు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ప‌రావాఫిలిమ్స్, షాన్ ఆంటోని అకౌంట్లు ఫ్రీజ్ చేసింది. దీనిపై వాళ్లు హైకోర్టుల‌కు వెళ్ల‌గా వాళ్ల‌ను అరెస్ట్ చేయొద్ద‌ని, ఇన్వెస్టిగేష‌న్ చేయాల‌ని ఆదేశించింది కోర్టు. 

పోలీసులు ఏమ‌న్నారంటే? 

హైకోర్టు ఆదేశాల మేర‌కు విచార‌ణ జ‌రిపిన పోలీసులు దానికి సంబంధించిన రిపోర్ట్ ను కోర్టుకు అందించారు. దాంట్లో అన్ని వివ‌రాలు వెల్ల‌డించారు. ప‌రావా ఫిలిమ్స్, షాన్ ఆంటోని ఇద్ద‌రు క‌లిసి ఉద్దేశ‌పూర్వ‌కంగానే సిరాజ్ ను మోసం చేసిన‌ట్లు చెప్పారు. సినిమాకి రూ.18.2 కోట్లు ఖ‌ర్చు చేసి, రూ.22కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు తప్పుడు లెక్క‌లు చూపించార‌ని అన్నారు. సిరాజ్‌కు ఇస్తామ‌న్న డ‌బ్బులు కూడా వాళ్లు ఇవ్వ‌లేద‌ని పోలీసులు రిపోర్ట్ లో పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సినిమా మొద‌ల‌వ్వ‌క‌ముందే ఒక షెడ్యూల్ కూడా పూర్తైపోయింద‌ని అబ‌ద్ధాలు చెప్పార‌ని పోలీసులు పేర్కొన్నారు. 

మ‌రోవైపు లీగ‌ల్ నోటీసులు.. 

‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమా కోర్టు చుట్టూ తిరుగుతోంది. ప్రొడ్యూస‌ర్ల‌పై ఛీటింగ్ కేసు కొలిక్కి రాక‌ముందే, మ‌రోవైపు కాపిరైట్స్ కేసు నోటీసులు పంపారు మ్యూజిక్ మాస్ట్రో ఇళ‌య‌రాజా. త‌న కంపోజ్ చేసిన సూప‌ర్ హిట్ పాటను సినిమాలో వాడుకున్నార‌ని ఆరోపించారు. త‌న ప‌ర్మిష‌న్ లేకుండా వాడుకున్నారంటూ లీగ‌ల్ నోటీసులు పంపారు ఆయ‌న‌. ఇక ఇప్పుడు ఈ కేసు కూడా వ‌చ్చి నెత్తిన ప‌డిన‌ట్లు అయ్యింది. 
  
చిన్న సినిమాగా రిలీజై రికార్డులు సృష్టించింది ‘మంజుమ్మెల్ బాయ్స్’. రికార్డు స్థాయిలో లాభాలు వ‌చ్చాయి సినిమాకి. చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శోభున్ షాహిర్​, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్, అరుణ్, దీపక్ పరంబోల్ లీడ్ రోల్స్‌లో నటించారు. చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంజుమ్మెల్ బాయ్స్’లో శోభున్ షాహిర్​, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్, అరుణ్, దీపక్ పరంబోల్ లీడ్ రోల్స్‌లో నటించారు.

Also Read: అంద‌రినీ మిస్ అవుతాను.. ఇంద్ర‌జ ఎమోష‌న‌ల్ పోస్ట్ - ‘జబర్దస్త్’కు వీడ్కోలు
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - ఆసీస్ ముందు భారీ లక్ష్యం
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - ఆసీస్ ముందు భారీ లక్ష్యం
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులిఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - ఆసీస్ ముందు భారీ లక్ష్యం
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - ఆసీస్ ముందు భారీ లక్ష్యం
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Embed widget