Jabardasth Indrajaa Post: అందరినీ మిస్ అవుతాను.. ఇంద్రజ ఎమోషనల్ పోస్ట్ - ‘జబర్దస్త్’కు వీడ్కోలు
Indrajaa :ఈటీవీలో ప్రసారమయ్యే టాప్ షోల్లో ఒకటి 'జబర్దస్త్'. ఆ షోకి ఎంతోమంది జడ్జ్ లుగా వ్యవహరించారు. వాళ్లలో ఒకరే ఇంద్రజ. ఇంద్రజ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది.
Indrajaa Emotional Post About Jabardasth: ఈటీవీలో ప్రసారమయ్యే టాప్ షోల్లో ఒకటి 'జబర్దస్త్'. ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆ షో. ఇక గురువారం వస్తే చాలు షో చూసేందుకు టీవీలకు అతుక్కుపోతారు అందరూ. అయితే, ఆ షోలో కమెడియన్లు వేసే పంచ్ లకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో.. జడ్జిలకి అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి జడ్జిల్లో ఒకరు నటి ఇంద్రజ. చాలా కాలం నుంచి ఆమె 'జబర్దస్త్',' శ్రీ దేవి డ్రామా కంపెనీ' షోలకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇప్పుడిక ఆమె కనిపించరట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తెలియజేసింది.
ఎమోషనల్ పోస్ట్..
ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఇంద్రజ చాలారోజులు సినిమాలకి గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత 'జబర్దస్త్', 'శ్రీ దేవి డ్రామా కంపెనీ' షోల్లో జడ్జిగా వస్తున్నారు. అయితే, ఇక నుంచి ఆమె 'జబర్దస్త్'లో కనిపించరట. ఇదే విషయాన్ని స్వయంగా ఇంద్రజ వెల్లడించారు. ఎమోషనల్ అవుతూ ఆమె ఇన్ స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. "నా కుటుంబసభ్యులతో.. అందరినీ చాలా మిస్ అవుతున్నాను" అంటూ జబర్దస్త్ టీమ్ తో ఒక గ్రూప్ ఫొటో పోస్ట్ చేశారు ఇంద్రజ. "అన్ని కామెడీ షోలకి తల్లి లాంటి షో 'జబర్దస్త్'. అదికొత్త ఫార్మెట్ లో రాబోతుంది. మిమ్మల్ని అందరినీ కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుంది. మీ సపోర్ట్ లవ్ ఇలానే ఉండాలి" అంటూ రాసుకొచ్చారు ఇంద్రజ. దీంతో తను ఇంక ఈ షోకి రావడం లేదని చెప్పకనే చెప్పారు ఆమె.
View this post on Instagram
'జబర్దస్త్'తో బాండింగ్..
'జబర్తస్త్' షోకి ఇప్పటి వరకు ఎంతోమంది జడ్జిలు వచ్చారు. షో ప్రారంభమైన మొదట్లో నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరించారు. వాళ్లిద్దరి కాంబినేషన్ అప్పట్లో చాలా హైలెట్. ఎంతో మంది అభిమానులు ఉన్నారు వాళ్ల జోడీకి. ఇక ఆ తర్వాత నాగబాబు ప్లేస్ లోకి మను వచ్చారు. రాజకీయాల్లో బిజీ అవ్వడంతో రోజా కూడా మానేశారు. కొన్ని రోజులు శేఖర్ మాస్టర్ కూడా జడ్జ్ గా వ్యవహరించారు. ఇప్పుడు కృష్ణ భగవాన్ గారు, ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తుండగా.. ఆమె కూడా వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.
ఇంద్రజకి 'జబర్దస్త్' కంటెస్టెంట్స్ తో చాలా బాండింగ్ ఏర్పడింది. ఆమె ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకునేవాళ్లు. ఎంతోమంది కంటెస్టెంట్స్ ఆమెను అమ్మ అని పిలుచుకుంటారు. ఇక ఇప్పుడు ఆమె వెళ్లిపోతుందంటే బాధపడుతున్నారు చాలామంది. కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. ఆడియెన్స్ కూడా తెగ కామెంట్లు పెడుతున్నారు. ''మీ కోసమే షో చూస్తున్నాం. వెళ్లొద్దు, వెళ్లొద్దు" అంటూ పోస్ట్ కింద కామెంట్లు పెడుతున్నారు.
రెండు షోలకి ఖుష్బూ..
'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్' అని కాకుండా రెండు రోజులూ 'జబర్దస్త్' పేరుతో ఈటీవీ ఛానల్లో ప్రసారం కానున్నట్లు తెలిసిన విషయమే. అయితే, ఆ రెండు షోలకి ఒకే జడ్జ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఇంద్రజకి గ్యాప్ ఇస్తున్నారా? లేదా రెండు రోజులూ ఖుష్బూను కంటిన్యూ చేస్తారా? అనేది చూడాలి. 'శ్రీదేవి డ్రామా ఆవిడ వుంటారా? లేదంటే గ్యాప్ ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: అందుకే ‘కేరళ స్టోరీ’ డైరెక్టర్ ఆడిషన్స్‌కు పిలిస్తే.. నో చెప్పా: ‘బిర్యాని’ నటి కని కస్రుతి