అన్వేషించండి

Peddi Nizam Bookings: 'పెద్ది'కి టెన్షన్ లేదు... తెలంగాణలోనూ టికెట్ రేట్స్ పెరిగాయ్... కాసేపటిలో బుకింగ్స్ మొదలు

Peddi Telangana Ticket Rates: 'పెద్ది'కి పది రోజుల పాటు టికెట్ రేట్ హైక్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బుధవారం ఉదయం బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రీమియర్ షోలు ఇవాళ, రేపు విడుదల.
  • తెలంగాణలో సినిమా టికెట్ ధరలు 10 రోజుల పాటు పెంచుకోవచ్చు.
  • సింగిల్ స్క్రీన్‌లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 పెరిగింది.
  • ప్రీమియర్ షోల టికెట్ ధర జీఎస్టీతో రూ. 600గా నిర్ణయించారు.

రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'పెద్ది'. ఇవాళ (జూన్ 3) రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోలు, రేపు (జూన్ 4) ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు పది రోజుల పాటు టికెట్ రేట్ హైక్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. టికెట్ రేట్లు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలైన మొదటి పది రోజులు పెంచిన రేట్లు అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. టికెట్ రేటు ఎంత పెరిగింది? అనేది చూస్తే...

సింగిల్ స్క్రీన్‌లలో 100... మల్టీప్లెక్స్‌లో 125
ప్రీమియర్ షోలకు ఏ థియేటర్ అయినా 600
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేటుపై 100 రూపాయలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. దాంతో బాల్కనీ టికెట్ రేటు 275 అయ్యింది. ఇక మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేటు విషయానికి వస్తే... 125 రూపాయలు పెంచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. దాంతో టికెట్ రేటు 420కి చేరుకుంది. జీవో జారీ కావడానికి ముందు మల్టీప్లెక్స్‌లలో 150 రూపాయల వరకు హైక్ ఉండవచ్చని వార్తలు వచ్చినప్పటికీ... 125 రూపాయలకే రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతించింది. థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఏపీలోనూ టికెట్ రేట్స్ పెరిగిన సంగతి తెలిసిందే.

Also Read: Peddi Advance Bookings Report - 'పెద్ది'తో రామ్ చరణ్ రికార్డుల వేట... అడ్వాన్స్ బుకింగ్స్‌తో బాక్సాఫీస్ సునామీ

జూన్ 4న సినిమా విడుదల. అయితే... ఇవాళ (జూన్ 3వ తేదీ) రాత్రి 8 గంటల నుండి స్పెషల్ ప్రీమియర్ షోల ప్రదర్శనకు అనుమతి లభించింది. ప్రీమియర్ షో టికెట్ రేటును జీఎస్టీతో 600 రూపాయలుగా నిర్ణయించారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా నైజాం బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

Also ReadPeddi Twitter Review - అమెరికాలో 'పెద్ది' ఫస్ట్ షో ఎప్పుడు? రామ్ చరణ్ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్స్ రిపోర్ట్ వచ్చేది ఎప్పుడంటే?

టికెట్ రేట్స్ హైక్ ద్వారా వచ్చే కలెక్షన్లలో 20 శాతాన్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు విరాళంగా ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే. ఆ డబ్బులను సినిమా ఇండస్ట్రీలోని కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం వినియోగించాలని నిర్ణయించారు. తెలంగాణ (నైజాం)లో ఎగ్జిబిటర్లు పర్సంటేజీ సిస్టమ్ కావాలని డిమాండ్ ఒక వైపు... టికెట్ రేట్ హైక్ వస్తుందా? లేదా? అనే సందిగ్ధత మరోవైపు... మంగళవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం నుంచి జీవో జారీ రావడం గనుక ఆలస్యం అయితే నార్మల్ టికెట్ రేట్లకు సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావించినట్టు టాలీవుడ్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు.

Also ReadPeddi Vs Game Changer - పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Avengers Doomsday Promo : అవెంజర్స్ డూమ్స్ డే ప్రోమో వచ్చేసింది - ఐరన్ మ్యాన్ పవర్ ఫుల్ విలన్
అవెంజర్స్ డూమ్స్ డే ప్రోమో వచ్చేసింది - ఐరన్ మ్యాన్ పవర్ ఫుల్ విలన్
Govinda Sunita Ahuja : కూతురి వయసున్న అమ్మాయితో ఇలానా! - గోవిందాపై భార్య సునీత ఫైర్
కూతురి వయసున్న అమ్మాయితో ఇలానా! - గోవిందాపై భార్య సునీత ఫైర్
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget