Peddi Advance Booking: 'పెద్ది'తో రామ్ చరణ్ రికార్డుల వేట... అడ్వాన్స్ బుకింగ్స్‌తో బాక్సాఫీస్ సునామీ
Peddi Collections Day 1: 'పెద్ది' అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. తెలంగాణ మినహా మిగతా ఏరియాల్లో రామ్ చరణ్ రికార్డుల వేట మొదలైంది. ఆల్రెడీ 'పెద్ది' ఖాతాలో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసుకోండి.

- రామ్ చరణ్ 'పెద్ది' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.
- ఓవర్సీస్ మార్కెట్‌లో 'పెద్ది' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.
- భారతదేశంలో 16 కోట్ల రూపాయలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి.
- ఈ సినిమా 50 కోట్ల మార్క్‌ను అడ్వాన్స్‌తోనే దాటగలదని అంచనా.
రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన 'పెద్ది' థియేటర్లలో సందడి చేయడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. బాక్సాఫీస్ బరిలో రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమైందీ సినిమా. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తెలంగాణ మినహా మిగతా ఏరియాల్లో మొదలు అయ్యాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో రామ్ చరణ్ క్రేజ్ మరోసారి చూపించిందీ సినిమా. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయి? అనేది చూస్తే...
బాక్సాఫీస్ బుకింగ్స్ ఎలా ఉన్నాయ్?
'పెద్ది' అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి. తెలుగు సినిమాకు కీలకమైన మార్కెట్లలో తెలంగాణ ముఖ్యమైనది. ఆ ఏరియాలో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. కానీ, బాక్స్ ఆఫీస్ బరిలో 'పెద్ది' అదరగొడుతోంది. ఆల్ ఇండియాలో తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ జూన్ 2వ తేదీ (మంగళవారం రాత్రి 9 గంటలకు) 16 కోట్ల రూపాయలు దాటాయి. జూన్ 3వ తేదీ ప్రీమియర్ షోస్ ద్వారా 6.87 కోట్లు వచ్చాయి. జూన్ 4 బుకింగ్స్ ద్వారా 9.47 కోట్లు వచ్చాయి.
ఓవర్సీస్ మార్కెట్‌లో 'పెద్ది' రికార్డుల వేట
Peddi Overseas Collection: ఓవర్సీస్‌లో, ముఖ్యంగా నార్త్ అమెరికాలో రామ్ చరణ్ 'పెద్ది' సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆల్రెడీ అక్కడ 8.9 కోట్ల రూపాయల (800K డాలర్స్) వచ్చాయి ప్రీ సేల్స్ ద్వారా. ప్రజెంట్ ట్రెండ్‌ను బట్టి ఈ సినిమా అమెరికాలో భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: Peddi Vs Game Changer - పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?
ఇండియా, అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే... జూన్ 2వ తేదీ రాత్రి 9 గంటలకు 22 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. జూన్ 3వ తేదీ సాయంత్రానికి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 50 కోట్ల మార్క్ రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఈ సినిమాకు ఎంత వరకు హెల్ప్ అవుతుంది? ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది? అనేది చూడాలి.
'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ పరుగు పందెంలో పాల్గొనే యువకుడిగా... అలాగే క్రికెటర్ & కుస్తీ వీరుడిగా కనిపించనున్నారు. ఆయన సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా... శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, అజయ్ ఘోష్, తారక్ పొన్నప్ప తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ ప్రత్యేక గీతం చేశారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేసిన చిత్రమిది.
Also Read: Peddi Vs Game Changer - పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















