Peddi : తెలుగు రాష్ట్రాల్లో పెద్ది సందడి - అడ్వాన్స్ బుకింగ్స్ షురూ... ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఫోకస్
Peddi Tickets : తెలుగు రాష్ట్రాల్లో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్, టికెట్ బుకింగ్స్ సందడి నెలకొంది. ఏపీలో పెరిగిన ధరలతో బుకింగ్స్ ప్రారంభం కాగా తెలంగాణలో సాయంత్రం ప్రారంభం కానున్నాయి.

Ram Charan's Peddi Advance Bookings Open : రామ్ చరణ్ పెద్ది మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయవాడలో సోమవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా... స్పెషల్ సర్ప్రైజెస్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అటు, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో...
ఏపీలో ఇప్పటికే ప్రీమియర్స్, టికెట్ రేట్స్‌పై కన్ఫర్మేషన్ వచ్చేయగా... డిస్ట్రిక్ట్ యాప్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇక తెలంగాణలో సోమవారం సాయంత్రం నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్‌పై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ప్రీమియర్ షోస్‌కు పర్మిషన్ రాకుంటే నార్మల్ షోస్‌కు బుకింగ్స్ ఓపెన్ చేస్తారు.
తెలంగాణలో టికెట్ ధరలు పెంచాలని వినతిపత్రం అందించినా అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేకర్స్ కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో టికెట్ రేట్స్ పెంచే అవకాశం లేనట్లేనని తెలుస్తోంది. అటు, ఏపీలో ప్రీమియర్ షో ధర జీఎస్టీతో కలిపి రూ.600, సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. జూన్ 4 నుంచి 10 రోజుల పాటు టికెట్ రేట్స్ పెంపు వర్తించనుండగా... రోజుకు 5 షోస్ వేసుకునేందుకు కూడా వీలు కల్పించింది.
Also Read : Vignesh Shivan : LIK మూవీకి ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ - నెగిటివ్ రివ్యూస్‌పై నయనతార భర్త ఎమోషనల్
ట్రెండింగ్ వార్తలు


















