అన్వేషించండి

Vignesh Shivan : LIK మూవీకి ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ - నెగిటివ్ రివ్యూస్‌పై నయనతార భర్త ఎమోషనల్

Vignesh Shivan Reaction : నెగిటివ్ ప్రచారం వల్ల డైరెక్టర్స్ కలలు ముక్కలవుతాయని అన్నారు డైరెక్టర్ విఘ్నేష్ శివన్. ప్రదీప్ రంగనాథన్ LIK ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ అందుకుంటుందని చెప్పారు.

Director Vignesh Shivan Strong Reaction About Negative Reviews : సినిమాపై కొందరు కావాలనే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు ప్రముఖ డైరెక్టర్, నయనతార భర్త విఘ్నేష్ శివన్. ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ ఎంటర్టైనర్ LIK మూవీ రిజల్ట్‌పై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.

ఓటీటీలో సూపర్ రెస్పాన్స్

థియేటర్లలో నెగిటివ్ రివ్యూస్ వచ్చినా ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ అందుకుందని చెప్పారు విఘ్నేశ్ శివన్. సినిమా అదిరిపోయిందని... నెగిటివ్ రివ్యూస్ చూసి సినిమా చూడలేదని చాలామంది తనకు మెసేజ్ చేసినట్లు తెలిపారు. ఇంత మంచి సినిమాకు ఎందుకు నెగిటివ్ ప్రచారం చేశారో తెలియడం లేదంటూ తనను ప్రశ్నించారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా రాసే నెగిటివ్ రివ్యూస్ దర్శకుల కలలు ముక్కలు చేస్తాయని రాసుకొచ్చారు.


Vignesh Shivan : LIK మూవీకి ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ - నెగిటివ్ రివ్యూస్‌పై నయనతార భర్త ఎమోషనల్

నెగిటివిటీ వల్లే...

'ఆన్ లైన్‌లో విపరీతమైన నెగిటివ్ ప్రచారం వల్లే LIK థియేటర్లలో చూడడం మిస్ అయ్యామంటూ చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు నెగిటివిటీని తట్టుకుని నిలబడతాయి. కొన్ని నిలబడలేవు. ఇండస్ట్రీలో ప్రభావవంతమైన సపోర్ట్ లేని సినిమాల విషయానికొస్తే... ప్రజాభిప్రాయం వాటి రిజల్ట్‌ను పూర్తిగా మార్చేస్తుంది. సినిమాను విమర్శించడమే కాకుండా కావాలని రాసే రివ్యూస్ ఆడియన్స్‌ను కన్ఫ్యూజ్‌కు గురి చేస్తాయి. డైరెక్టర్స్ కలలు ముక్కలు చేస్తాయి.

LIK బాక్సాఫీస్ ఫలితాన్ని నేను ఇప్పటికీ పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నా. దాని నుంచి బయటకు రాలేకపోతున్నా. మంచి టాక్‌తో సూపర్ ఓపెనింగ్ వీకెండ్ తర్వాత కథ ఇంత త్వరగా మారిపోవడం చాలా బాధేసింది. చాలా కష్టపడి దాన్ని రూపొందించాం. ఇంకా మంచి రెస్పాన్స్ దక్కాల్సి ఉందని ఇప్పటికీ అనిపిస్తోంది.' అంటూ ఇన్ స్టాలో పోస్టే చేశారు విఘ్నేష్.


Vignesh Shivan : LIK మూవీకి ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ - నెగిటివ్ రివ్యూస్‌పై నయనతార భర్త ఎమోషనల్

Also Read : Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం

'అదే ఆశతో జీవిస్తున్నా'

ఎన్నో సవాళ్లను అధిగమించిన తర్వాత మూవీ రిజల్ట్ ఇలా చూడడం ఎంతో బాధగా ఉందని చెప్పారు విఘ్నేశ్. 'ఇలాంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం వెనుకున్న పోరాటం చాలామందికి తెలియదు. దీన్ని నిర్మించడం కష్టం. రిలీజ్ చేయడం ఇంకా కష్టం. మొదట్లో మంచి రెస్పాన్స్ రాకపోయినా ఆ తర్వాత అద్భుతమైన చిత్రాలుగా నిలిచిన మూవీస్ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఇది కూడా అలాగే నిలిచిపోతుందన్న ఆశతో జీవిస్తున్నా.' అంటూ రాసుకొచ్చారు.

వరుస హిట్లతో దూసుకెళ్తోన్న కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్‌కు LIKతో బ్రేక్ పడింది. ఫస్ట్ డే నుంచే ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా... ఎస్ జే సూర్య, గౌరీ కిషన్, యోగిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. థియేటర్లలో అంత రెస్పాన్స్ రాకపోయినా... మే 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ అందుకుంది.

Also Read : Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget