Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో విషాదం... కన్నీరుమున్నీరవుతున్న RX 100 హీరోయిన్
Payal Rajput Father Died: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి విమల్ కుమార్ మరణించారు. ఆ విషయాన్ని పాయల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమెకు పితృ వియోగం కలిగింది. పాయల్ తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) సోమవారం కన్ను మూశారు. క్యాన్సర్‌తో గత కొన్నేళ్లుగా బాధపడుతున్న ఆయన జూలై 28న తుది శ్వాస విడిచారు. తండ్రి మరణంతో పాయల్ రాజ్‌పుత్ విలపిస్తున్నారు. కన్నీరుమున్నీరవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాన్నా అంటూ గుండె పగిలిన ఎమోజీని షేర్ చేస్తూ తన బాధను పంచుకున్నారు.
తండ్రికి కీమో థెరపీ చికిత్స...
కొన్ని నెలల క్రితం పాయల్ పోస్ట్
పాయల్ రాజ్‌పుత్ గత కొన్ని నెలల క్రితమే తన తండ్రి దీనావస్థ గురించి అందరికీ తెలిపారు. కీమో థెరపీ జరుగుతోందని, అందరి ఆశీస్సులు కావాలని, తన తండ్రి కోలుకోవాలని అందరూ ప్రార్థించమని సోషల్ మీడియాలో పాయల్ పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు పాయల్ తండ్రి క్యాన్సర్‌తో పోరాడుతూ ఓడిపోయారు. తండ్రి మరణించిన దుఃఖం నుంచి పాయల్ ఇంకా కోలుకోలేదు.
View this post on Instagram
పాయల్ చేసిన ఎమోషనల్ పోస్ట్‌ను చూసి అభిమానులు చలించిపోతోన్నారు. ''నువ్వు ఇకపై ప్రత్యక్షంగా, భౌతికంగా నాతో ఉండలేకపోయినా... నీ ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉంటుంది నాన్నా... మీ నవ్వులు, మీ వాయిస్, మీ ఉనికి ఇలా అన్నింటినీ ఇకపై నేను మిస్ అవుతూనే ఉంటాను... ఈ ప్రపంచం నుంచి నువ్వు వెళ్లిపోయి ఉండొచ్చు... నా మనసు, హృదయం లోంచి నువ్వు వెళ్లలేదు... లవ్ యూ పప్పా'' అని పాయల్ భావోద్వేగానికి గురి అయ్యారు.
Also Read: నాగ్ మామ కాదు... నాగ్ సామ - అదీ జపాన్‌లో మన కింగ్ క్రేజ్!
''పప్పా... నేను నీకు చేయగల్గిందంతా చేశాను. క్యాన్సర్‌పై ఎంత పోరాటం చేయాలో అంతా చేశాం. కానీ మనం విజయం సాధించలేకపోయాం. క్షమించు నాన్నా... లవ్యూ'' అంటూ పాయల్ ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేశారు. రాయ్ లక్ష్మీ, దివి, పాయల్ ప్రియుడు సౌరభ్ వంటి వారు సోషల్ మీడియాలో ఆమెకు ధైర్యం చెప్పారు. పాయల్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ''నీ పరిస్థితి ఎలా ఉంటుందో మేం ఊహించుకోగలం... ఆయన ఆత్మకు శాంతి కలగాలి... ఆయన ఎప్పుడూ నీ చుట్టూనే ఉంటారు. నీకు, నీ కుటుంబానికి ఆ దేవుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను'' అని పాయల్ కు అండగా రాయ్ లక్ష్మీ ధైర్యం చెప్పారు.
'ఆర్ఎక్స్ 100' సినిమాతో కథానాయికగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన పాయల్, ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. విక్టరీ వెంకటేష్ సరసన 'వెంకీ మామ', మాస్ మహారాజా రవితేజ 'డిస్కో రాజా', అజయ్ భూపతి 'మంగళవారం' ఆమెకు పేరు తెచ్చాయి.





















