Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ అప్పుడేనా?
Ustaad Bhagat Singh Release: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్‌పైనే ఇప్పుడు అందరి చూపు ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan's Ustaad Bhagat Singh Release: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రాబోతోన్న అవెయిటెడ్ మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగా... రిలీజ్ ఎప్పుడా? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పవన్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయగా... వింటేజ్ లుక్ అదిరిపోయింది. ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ఇంట్రెస్ట్ బజ్ తాజాగా వైరల్ అవుతోంది.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారనే రూమర్స్ వినిపించాయి. తాజాగా... ఫిబ్రవరిలో కాదు మార్చిలో రిలీజ్ కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఆ టైంలో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి దీనిపై మూవీ టీం అఫీషియల్‌గా రియాక్ట్ కావాల్సి ఉంది.
వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఫుల్ ట్రాఫిక్ నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ సహా ప్రభాస్ 'ది రాజాసాబ్', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' రిలీజ్ కానున్నాయి. సంక్రాంతి సందడి మొత్తం పూర్తైన తర్వాత సమ్మర్ స్పెషల్‌గా పవన్ మూవీని థియేటర్లలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: చిరంజీవిని కలిసిన టీఎఫ్‌జేఏ నూతన కమిటీ... తన సాయం ఎప్పుడూ ఉంటుంది 'మెగా' అభయం
మూవీలో పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలతో పాటు రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నట్లు తెలుస్తుండగా... ఫోటోగ్రాఫర్ పాత్రలో రాశీ ఖన్నా కనిపించనున్నారు. వీరితో పాటే 'యుగానికి ఒక్కడు' ఫేం పార్తీబన్ విలన్ రోల్ చేస్తుండగా... కేఎస్ రవికుమార్, నవాబ్ షా, రాంకీ, కేజీఎఫ్ ఫేం అవినాష్, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. హరీష్, పవన్ కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని... థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.





















