Mass Jathara Postponed: బాహుబలి కోసం ఒక్క రోజు వెనక్కి వెళ్లిన 'మాస్ జాతర'?
Mass Jathara New Release Date: మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా 'మాస్ జాతర' మరోసారి వాయిదా పడిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈసారి ఒక్క రోజు వెనక్కి వెళ్లిందట.

'బాహుబలి'తో ఓపెనింగ్ డే క్లాష్ వద్దని మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా నిర్మాతలు భావిస్తున్నారట. అవసరం అయితే తమ సినిమాను ఒక్క రోజు వెనక్కి తీసుకు వెళదామని డిసైడ్ అయ్యారట. దాంతో అక్టోబర్ 31న 'మాస్ జాతర' థియేటర్లలోకి రావడం లేదని ఫిలింనగర్ వర్గాల టాక్. పూర్తి వివరాలలోకి వెళితే...
నవంబర్ 1న మాస్ జాతర...
ముందు రోజు రాత్రి ప్రీమియర్లు!
నవంబర్ 1వ తేదీన మాస్ జాతర చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 31వ తేదీన విడుదల కావాల్సిన చిత్రాన్ని ఒక్క రోజు వెనక్కి తీసుకువెళ్లారు. అయితే పూర్తిగా వెనక్కి వెళ్లలేదు. అక్టోబర్ 31 రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టెక్నికల్లీ సినిమా రిలీజ్ అక్టోబర్ 31నే అయితే కొన్ని థియేటర్లలో మాత్రమే రిలీజ్ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో నవంబర్ 1న రిలీజ్ కానుంది.
బాహుబలికి లైన్ క్లియర్...
జక్కన్న సినిమాకు ఫుల్ ఓపెనింగ్స్!
అక్టోబర్ 31న 'బాహుబలి ది ఎపిక్' విడుదల కానుంది. 'బాహుబలి ది బిగినింగ్', 'బాహుబలి ది కన్‌క్లూజన్'... రెండు భాగాలను కలిపి ఒక్కటిగా థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఆ సినిమాకు ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యింది. జక్కన్న సినిమాకు ఫుల్ ఓపెనింగ్స్ లభించనున్నాయి. ఎందుకంటే అక్టోబర్ 31న ఆ సినిమాకు సోలో రిలీజ్ దక్కుతుంది. తమిళ డబ్బింగ్ సినిమాలు ఉన్నప్పటికీ 'బాహుబలి'కి అసలు పోటీ కానే కాదు.
Also Read: మీ టైపు ఎవరు? అందరికీ తెలుసు... రౌడీయేగా - కన్ఫర్మ్ చేసిన రష్మిక
రాజమౌళి, రవితేజ మధ్య మంచి అనుబంధం ఉంది. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన 'విక్రమార్కుడు' సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. అటువంటి స్నేహితుల మధ్య క్లాష్ వస్తుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఒక్క రోజు గ్యాప్ ఉండడం వల్ల రెండు సినిమాలకు కలిసి వస్తుందని చెప్పాలి.
Also Read: రష్మిక vs దీపిక... బాలీవుడ్ బ్యూటీకి నిర్మాత ఎస్కేఎన్ కౌంటర్





















