ఏంటీ సూర్యారాధన - పవన్ ఎందుకు చేస్తున్నారు! అన్నదాత , అనంతశక్తి ప్రదాత, ఆరోగ్యసిద్ధిదాయకుడు ఆదిత్యుడు భూమ్మీద ఉన్న ప్రాణులంతా ఆయురారోగ్యఐశ్వర్యాలతో వృద్ధిచెందేందుకు సూర్యారాధన చేస్తారు ప్రత్యక్షభగవానుడి ప్రకాశాన్ని అనుసరించి ఒక్కో నెల ఒక్కో పేరుతో సూర్యారాధన చేయాలని వేదం చెబుతోంది సూర్యారాధన చేయడం అంటే ప్రత్యక్షంగా కనిపించే భగవంతుడని ఆరాధించడమే బుద్ధి, జ్ఞానం, శక్తిని అందించే సూర్యుడిని ఆరాధించి ఎందరో ఋషులు, యోగులు అద్భుత ఫలితాలు పొందారు సూర్యయోగం పేరుతో ఓ ఆధ్యాత్మిక ప్రక్రియను రూపకల్పన చేసి అందించారు సూర్యనమ స్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు మనలో శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలుగుతుంది శరీరం, ప్రాణం, మనసు..ఈ మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది సూర్యారాధన మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరచుకున్నప్పుడు శరీరం నిలుపుకునేందుకు బాహ్యమైన ఆహారపదార్థాల అవసరాన్ని తగ్గిస్తుంది అంటే భోగశరీరాన్ని యోగ శరీరంగా మార్చేస్తుంది సూర్యారాధన...తద్వారా అపారమైన శాంతి, సమస్థితి కలుగుతాయి. Image Credit: playground.com