Chiranjeevi - TFJA: చిరంజీవిని కలిసిన టీఎఫ్‌జేఏ నూతన కమిటీ... తన సాయం ఎప్పుడూ ఉంటుంది 'మెగా' అభయం
Telugu Film Journalists Association: 'తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్' (టీఎఫ్‌జేఏ)కు ఇటీవల నూతనంగా ఎన్నికైన కొత్త కమిటీ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వంగా కలిసింది.

'తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ' (Telugu Film Journalists Association - TFJA)కు ఇటీవల కొత్త కమిటీ ఎన్నికైన సంగతి తెలిసిందే. టీఎఫ్‌జేఏ నూతన అధ్యక్షుడిగా వైజే రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు మిగతా కమిటీ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని మర్యాదపూర్వకంగా కలిశారు.
చిరు ముందుకు సంక్షేమ కార్యక్రమాలు
TFJA Meets Chiranjeevi: టీఎఫ్‌జేఏ తమ సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులకు అసోసియేషన్ అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ సహా పలు సహాయ కార్యక్రమాలను చిరంజీవికి సభ్యులు వివరించారు. భవిష్యత్తులో హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ వంటివి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: టీఎఫ్‌జేఏ నూతన కార్యవర్గం... అధ్యక్షుడిగా వైజే రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నిక
ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం టీఎఫ్‌జేఏ చేపట్టిన కార్యక్రమాలను చిరంజీవి ప్రశంసించారు. టీఎఫ్‌జేఏకి ఎప్పుడూ తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని నూతన కమిటీని చిరంజీవి అభయం ఇచ్చారు. ఆయన్ను కలిసిన వారిలో టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు వైజే రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, కోశాధికారి సురేంద్ర కుమార్ నాయుడు, ఇతర కమిటీ మెంబర్స్ ఉన్నారు.
The newly formed TFJA committee had a cordial meeting with Megastar @KChiruTweets garu.
— Telugu Film Journalists Association (@FilmJournalists) October 25, 2025
He extended his best wishes and promised continued support to the Telugu Film Journalists Association.#MegastarChiranjeevi #TFJA @yjrambabu @RaghuStarMaa pic.twitter.com/wHzQCwHq58





















