TFJA New Committee: టీఎఫ్‌జేఏ నూతన కార్యవర్గం... అధ్యక్షుడిగా వైజే రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నిక
తెలుగు సినిమా జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, ఉద్దేశంగా పని చేస్తున్న 'తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్' (TFJA) నూతన కార్యవర్గం ఏర్పాటు అయ్యింది. అధ్యక్షుడితో పాటు ఇతర బాడీ మెంబర్స్ వివరాలు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని విలేకరుల సంక్షేమం, ఆరోగ్యం తమ ప్రధాన లక్ష్యంగా, ధ్యేయంగా పని చేస్తున్న సంస్థ 'తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్' (Telugu Film Journalists Association). తాజాగా అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. అధ్యక్షుడితో పాటు ఇతర బాడీ మెంబర్స్ వివరాలు తెలుసుకోండి.
టీఎఫ్‌జేఏ నూతన అధ్యక్షుడిగా వైజే రాంబాబు
'తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్' (TFJA)లో ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్, డిజిటల్ మీడియా సంస్థల్లో ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్న 221 మంది సభ్యులుగా ఉన్నారు.
టీఎఫ్‌జేఏ నూతన అధ్యక్షునిగా వైజే రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఇక ప్రధాన కార్యదర్శిగా ప్రసాదం రఘు, కోశాధికారిగా సురేంద్ర కుమార్ నాయుడు, ఉపాధ్యక్షులుగా జే అమర్ వంశీ, వి ప్రేమ మాలిని, సంయుక్త కార్యదర్శులుగా జీవి రమణ, సురేష్ కొండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) మెంబర్లుగా వై రవిచంద్ర, ఎం చంద్రశేఖర్, ఫణి కందుకూరి, డా చల్లా భాగ్యలక్ష్మి, బి వేణు, శివ మల్లాల, రాంబాబు పర్వతనేని, దీపక్ కోడెల, కె సతీష్, శ్రీను దుడ్డి, సత్య పులగం నియమితులు అయ్యారు.
రాబోయే కాలంలో హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్
ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సభ్యులకు, వాళ్ళ కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీని టీఎఫ్‌జేఏ అందిస్తోంది. హెల్త్ క్యాంపులు సహా పలు సంక్షేమ, సహాయ కార్యక్రమాలు నిర్వహించింది.
వైజే రాంబాబు నాయకత్వంలోని కొత్తగా ఏర్పాటైన కార్యవర్గం సభ్యుల కోసం హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ వంటివి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలిపింది. ప్రస్తుత జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతో పాటు సభ్యుల ఉన్నతికి మరింత కృషి చేస్తామని వివరించింది. tfja18@gmail.com మెయిల్ ఐడీ, +91 72778 45678 ఫోన్ నంబర్లలో టీఎఫ్‌జేఏని సంప్రదించవచ్చు.
టీఎఫ్‌జేఏ (TFJA) నూతన కార్యవర్గం
— Telugu Film Journalists Association (@FilmJournalists) October 24, 2025
తెలుగు సినిమా జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన ఉద్దేశంగా పని చేస్తున్న సంస్థ 'తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్' (TFJA).
Mail ID: tfja18@gmail.com pic.twitter.com/gJilyIbPQB





















