Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా 'సాహో' ఫేమ్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఇదీ పాన్ ఇండియా సినిమాయే. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... టైటిల్ ఫిక్స్ చేశారు.
'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్'గా పవన్!
Pawan Kalyan As OG : సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, దాని మీద క్యాప్షన్ గుర్తు ఉందా? 'ఆయన్ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటారు' (They Call Him #OG) అని పేర్కొన్నారు. ఇప్పుడు దానినే టైటిల్ కింద ఫిక్స్ చేశారు.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో OG టైటిల్ రిజిస్టర్ చేయించారు నిర్మాత డీవీవీ దానయ్య. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదీ సంగతి!
వచ్చే నెలలో షూటింగ్ షురూ!
ఏప్రిల్ నెలలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సుజీత్ ప్లాన్ చేశారు. ఈ మధ్య సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్, ఆయన కలిసి కొన్ని లొకేషన్స్ చూసి వచ్చారు. అయితే, ఏప్రిల్ షూటింగులో పవన్ కళ్యాణ్ లేని సీన్లు తీయడానికి ప్లాన్ చేశారు. మే నెలలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతారని తెలిసింది.
Also Read : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?
View this post on Instagram
రీమేక్ కాదు... స్ట్రెయిట్ సినిమా!
పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో సినిమా రీమేక్ కాదని తెలిసింది. పవర్ స్టార్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని సుజీత్ స్టయిలిష్ యాక్షన్ స్క్రిప్ట్ డిజైన్ చేశారట. ఈ కథ కంటే ముందు అతడి చేతిలో వేరే స్క్రిప్ట్ పెట్టారని, ఆ రీమేక్ చేయవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించింది. అయితే... సుజిత్ చెప్పిన కథ నచ్చడంతో స్ట్రెయిట్ సినిమా చేయడానికి పవన్ మొగ్గు చూపారు.
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా డీవీవీ సంస్థలో రెండో చిత్రమిది. ఇంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ హీరోగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా నిర్మించారు. పదేళ్ళ తర్వాత మళ్ళీ పవన్‌తో సినిమా చేస్తుండటం విశేషం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏయం రత్నం నిర్మిస్తున్న 'హరి హర వీరమల్లు' షూటింగ్ కొంత పూర్తి అయ్యింది. సముద్రఖని దర్శకత్వంలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, పవన్ నటిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అది ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 28న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సుజీత్ సినిమా ఒకటి.
Also Read : మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా టైటిల్ అనౌన్స్ చేసేది ఆ రోజే
View this post on Instagram