OG First Single: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - గెట్ రెడీ ఫర్ 'ఓజీ' ఫస్ట్ బ్లాస్ట్
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ 'ఓజీ' మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అనౌన్స్ చేశారు మేకర్స్.

Pawan Kalyan's OG First Single Release Date: థియేటర్లలో 'హరిహర వీరమల్లు' మేనియా నడుస్తుండగానే... పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ హీరోగా అవెయిటెడ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ' మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
పవన్ వీరాభిమానుల్లో ఒకరైన సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. 'కోపంలో పుట్టి, పోరాటానికే కట్టుబడ్డాడు. అతను చివరి పేజీ రాయడానికి తిరిగి వచ్చాడు.' అంటూ మేకర్స్ రాసుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఈ మూవీలో పవన్ పవర్ ఫుల్ 'గంభీర' పాత్రలో కనిపించనున్నారు. 'దే కాల్ హిమ్ ఓజీ' అనేదే పూర్తి టైటిల్. పవన్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించగా... ప్రకాష్ రాజ్, శ్రియారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ లెజెండ్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.
View this post on Instagram
సెప్టెంబర్ 25న రిలీజ్
మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ కాగా... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న సినిమాను రిలీజ్ చేసేందుకు టీం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన 'ఓజీ' గ్లింప్స్ ట్రెండింగ్‌గా నిలుస్తోంది.
Also Read: టోన్ మార్చిన కొత్త ప్రెడేటర్... ట్రైలర్ చూశారా? కాన్సెప్ట్ ఇదే - మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ వరుసగా సినిమాలు పూర్తి చేస్తున్నారు. హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ 'హరిహర వీరమల్లు' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా... 'ఓజీ' హిట్ కావడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా క్లైమాక్స్ షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. దీంతో ఈ ఏడాది పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఖాయంగా తెలుస్తోంది.





















