అన్వేషించండి

Predator BadLands Preview: టోన్ మార్చిన కొత్త ప్రెడేటర్... ట్రైలర్ చూశారా? కాన్సెప్ట్‌ ఇదే - మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

Predator BadLands Release Date: హారర్, యాక్షన్ కలగలపిన 'ప్రెడేటర్' ఫ్రాంచైజీలో కొత్త మూవీ 'ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్' ట్రైలర్ రిలీజైంది. ఈ మూవీతో మొత్తం ఫ్రాంచైజీ టోన్ మార్చేయనున్నారు నిర్మాతలు.

ఆర్నాల్డ్ స్కార్జినెగ్గర్ హీరోగా 1987లో వచ్చిన 'ప్రెడేటర్' మూవీ ఒక కల్ట్ క్లాసిక్. 18 మిలియన్ డాలర్ల సాధారణ బడ్జెట్ తో రూపొందిన ఆ మూవీ 98 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. టీవీ ఛానళ్ళలో వచ్చినప్పుడు ఇప్పటికీ ఆ సినిమాని ఇంట్రెస్టింగ్ గా చూసే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఆ సినిమా హిట్ తో 'ప్రిడేటర్'ను ఒక ఫ్రాంచైజీ మార్చిన హాలీవుడ్ ఇప్పుడు ఆ సిరీస్ లో కొత్త మూవీ 'ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్'ను రిలీజ్ కు సిద్ధం చేసింది. ఏడాది నవంబర్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్య రిలీజ్ అయింది. సిరీస్ లోని పాత సినిమాలుకు భిన్నంగా టోటల్‌గా సరికొత్త టౌన్‌లో ఈ సినిమా రూపొందుడంతో 'ప్రెడేటర్' అభిమానులు సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొత్త సినిమా కథ మారిందండోయ్... కాన్సెప్ట్ ఇదే
సినిమా ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం ఒక యువ ప్రెడేటర్‌ను శక్తిహీనుడంటూ తమ ప్లానెట్ నుండి వేరొక గ్రహంలో వదిలేస్తారు. డెత్ ప్లానెట్‌గా పిలుచుకునే ఆ గ్రహంలో భయంకరమైన జీవులు ఉంటాయి. అదే గ్రహంలో మనుషులు వదిలేసిన సగం తెగిపోయిన మనిషి లాంటి సింథటిక్ ఆండ్రాయిడ్ 'థియా' యువ ప్రెడేటర్‌తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి డెత్ ప్లానెట్‌లోని భయంకరమైన ప్రమాదాలను ఎలా ఎదుర్కొంటారు? అనేదే సినిమా కథ.

టోటల్‌గా మారిపోయిన ప్రెడేటర్ టోన్... కొత్తగా!
'ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్' మూవీ ఫ్రాంచైజీలో 9వ సినిమా. కానీ మిగిలిన సినిమాల్లో లేని సరికొత్త టోన్ ఈ మూవీ ట్రైలర్‌లో కనిపిస్తోంది. ప్రెడేటర్ డిజైన్ గానీ దాని ఫిజిక్ గాని గత సినిమాలతో పోలిస్తే కంప్లీట్‌గా కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పైపెచ్చు ఈ సినిమాలో ప్రెడేటర్ హీరో కావడం విశేషం.

Also Read: 'కింగ్‌డమ్' రివ్యూ: విజయ్ దేవరకొండ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది? సినిమా హిట్టేనా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 20th Century Studios (@20thcenturystudios)

కొత్త ప్రెడేటర్ డైరెక్టర్ మీద నమ్మకం... డాన్! 
నిజానికి మొదటి రెండు సినిమాలతో పోలిస్తే మిగిలిన 'ప్రెడేటర్' సిరీస్‌పై విమర్శకులు ఎప్పుడూ పెదవి విరుస్తూనే వచ్చారు. 2018లో 'ది ప్రెడేటర్' మూవీ డిజాస్టర్ కావడంతో ఇక ఆ సిరీస్ ఆగిపోయినట్టేనని అందరూ భావించారు.  కానీ కొత్త దర్శకుడు డాన్ ట్రాచెన్ బెర్గ్ ( Dan Trachtenberg) 2022లో HuLu ott కోసం రూపొందించిన 'PREY' మూవీ అనూహ్యంగా సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్ - HULU డిస్నీ OTT కోసం ఆయన తీసిన యానిమేషన్ మూవీ 'ప్రెడేటర్ : కిల్లర్ అఫ్ ది కిల్లర్స్' ఈ ఏడాది జూన్‌లో రిలీజై క్రిటిక్స్ ప్రశంసలు పొందింది. ఇప్పుడు అదే డైరెక్టర్ నుంచి 'ప్రెడేటర్ : బ్యాడ్ ల్యాండ్స్' సినిమా నవంబర్ 7న రిలీజ్ కావడానికి సిద్ధమైంది. దానితో ఆ ప్రాంచైజీ అభిమానులు ఎంతో ఆసక్తిగా మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను 'ఏలియన్' సినిమా ఫ్రాంచైజీతో కలిపే హింట్స్ సినిమా ట్రైలర్ లో చాలానే ఉన్నాయి. ఇంతకు ముందు ఒకసారి ఆ ప్రయత్నం జరిగినా అది పెద్దగా సక్సెస్ కాలేదు. తనతో ఎలా చూసినా 'ప్రెడేటర్ : బ్యాడ్ ల్యాండ్స్' మూవీ అటు 'ప్రెడేటర్' సిరీస్‌కూ, ఇటు 'ఏలియన్' సిరీస్‌కూ భవిష్యత్తులో మరిన్ని కొత్త స్టోరీ లైన్లతో సినిమాలు వచ్చేందుకు దారులు తెలుస్తుందని ఆ రెండు ఫ్రాంచైజీల అభిమానులూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read: ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థ‌తో ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమా - ఫ‌హాద్ ఫాజిల్ తండ్రితో ప‌వ‌ర్‌ స్టార్ సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget