Mayasabha Web Series Trailer: ప్రాణ స్నేహితులే రాజకీయ శత్రువులు - రాష్ట్ర విధిని మార్చిన కథ... ఆసక్తికరంగా 'మయసభ' ట్రైలర్
Mayasabha Trailer: ఆది పినిశెట్టి, చైతన్యరావు కీలక పాత్రలు పోషించిన లేటెస్ట్ పొలిటికల్ వెబ్ సిరీస్ 'మయసభ' ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ పొలిటికల్ పంచ్‌లతో ఆకట్టుకుంటోంది.

Aadhi Pinisetty Chaitanya Rao Mayasabha Trailer Out: రోడ్డుపై యాక్సిడెంట్... ఓ కమ్యూనిస్ట్ లీడర్ చనిపోతాడు. అతని బంధువులు రోదిస్తూ ఎదురుగా వస్తోన్న బస్సును ఆపి... ఆ మృతదేహాన్ని బస్సులో రాజంపేట వరకూ చేర్చమంటారు. 'శవాన్ని ఎట్టా ఎక్కించుకోమంటావ్'... అంటూ కండక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయగా... ఇద్దరు యువకులు కండక్టర్‌తో గొడవపడతారు.
'అర్థగంట ముందు ప్రాణంతో ఉన్న మనిషిని శవం అనొద్దు.' అంటూ ఓ యువకుడు కండక్టర్‌పై కేకలు వేస్తాడు. అలా ఆ డెడ్ బాడీని బస్సులో ఎక్కించుకుంటారు. ఆ ఇద్దరు యువకులు కూడా బస్సెక్కుతారు. 'నీ పేరేంటి?' అని ఓ యువకుడు రెండో వాడిని అడుగుతాడు. 'కృష్ణమ నాయుడు' అంటూ ఆ యువకుడు చెప్పగా... తన పేరు ఎంఎస్ రామిరెడ్డి అంటూ తనను పరిచయం చేసుకుని చేయి కలుపుతారు. కట్ చేస్తే... వారిద్దరూ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ప్రాణ స్నేహితులుగా ఉన్న వారు రాజకీయ బద్ధ శత్రువులుగా మారి... పొలిటికల్ ముఖచిత్రాన్నే మార్చేశారు.
బెస్ట్ ఫ్రెండ్స్... పొలిటికల్ ఎనిమీస్
అసలు, ప్రాణ స్నేహితులు రాజకీయ శత్రువులుగా ఎలా మారారు? అనే బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతోంది 'మయసభ' వెబ్ సిరీస్. ఈ సిరీస్ టీజర్ ఇప్పటికే రిలీజై ఆకట్టుకుంటుండగా... తాజాగా ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. దేవా కట్టా, కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో ఆది పినిశెట్టి, చైతన్యరావు కీలక పాత్రలు పోషించారు.
A friendship tested by ambition.
— Sony LIV (@SonyLIV) July 31, 2025
A rivalry that redefined leadership.
A story that changed the fate of a state.#Mayasabha Trailer out now.#Mayasabha – A gripping political saga – Starts streaming from August 7th on @sonyliv@devakatta @aadhiofficial @IamChaitanyarao pic.twitter.com/zifwbbntBc
సీబీఎన్ వర్సెస్ వైఎస్సార్
పొలిటికల్ లెజెండ్స్ చంద్రబాబు, వైఎస్సార్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించినట్లు ట్రైలర్, టీజర్ బట్టి అర్థమవుతోంది. చంద్రబాబు రోల్‌లో ఆది పినిశెట్టి, వైఎస్సార్ రోల్‌లో చైతన్యరావు నటించారు. పాలిటిక్స్‌లోకి రాక ముందు వీరిద్దరూ ఎక్కడ ఎలా కలిశారు? స్టూడెంట్ లీడర్ నుంచి సీఎం వరకూ చంద్రబాబు ఎదిగిన తీరుతో పాటు డాక్టర్ నుంచి వైఎస్సార్ పొలిటికల్ ఎంట్రీ వరకూ అన్నీ అంశాలను ఈ సిరీస్‌లో చూపించారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు రాజకీయ శత్రువులుగా ఎలా మారారు? అనేదే బ్యాక్ డ్రాప్. సీనియర్ ఎన్టీఆర్ రోల్‌లో డైలాగ్ కింగ్ సాయికుమార్ నటించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సిరీస్‌ను హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించారు. హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించారు. ఆగస్ట్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.
Also Read: విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ - అనసూయ పోస్ట్.. నెటిజన్ల సెటైర్లు





















