News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Pawan Kalyan - HHVM Update: విజయ దశమికి హరి హర 'పవన్' వీరమల్లు?

Power Star Pawan Kalyan - Director Krish Jagarlamudi Movie Hari Hara Veera Mallu is likely to get released in theaters for the Vijaya Dashami?: విజయ దశమికి వీరమల్లుతో పవన్ కల్యాణ్ వస్తున్నారా? 

FOLLOW US: 
Share:

Pawan Kalyan's Hari Hara Veera Mallu Eyeing On Dasara Festival Release: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విజయ దశమికి వీరమల్లుగా ప్రేక్షకుల ముందుకు రానున్నారా? దసరాకు చారిత్రక చిత్రంతో థియేటర్లలో సందడి చేయడానికి ఆయన రెడీ అవుతున్నారా? అంటే... ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి 'అవును' అనే సమాధానం వినబడుతోంది. అయితే... అది అంత సులభం కాదు. అలాగని, కష్టం కూడా కాదు. ఎందుకంటే... ఇంకా షూటింగ్ బ్యాలన్స్ ఉంది కనుక!

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న సినిమా 'హరిహర వీరమల్లు'. మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేపథ్యంలో చారిత్రక చిత్రంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఏడాదిగా సినిమా షూటింగ్ జరగలేదు. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దసరాకు విడుదల చేయాలని అనుకుంటున్నారట. అయితే... ఈ సినిమాతో పాటు తమిళ సినిమా 'వినోదయ సితమ్' రీమేక్ షూటింగ్ కూడా చేయాలని పవన్ భావిస్తున్నారు. ఆ సినిమాకు ఆయన 20 రోజులు షూటింగ్ చేస్తే చాలు. కానీ, 'హరి హర వీరమల్లు'కు ఎక్కువ రోజులు కావాలి. అందువల్ల, దసరా విడుదల సాధ్యమేనా? కాదా? అని కొందరు డౌట్ పడుతున్నారు.

పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ  భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
Also Read: నాగచైతన్యను ఫాలో అవ్వడం మానేసిన సమంత
Also Read: ‘డీప్ వాటర్’ రివ్యూ - భార్య అఫైర్స్‌కు భర్త ఊహించని ట్రీట్మెంట్, పెద్దలకు మాత్రమే!

View this post on Instagram
 
A post shared by Krish Jagarlamudi (@dirkrish)

Published at : 21 Mar 2022 04:26 PM (IST) Tags: pawan kalyan Pawan Kalyan HHVM Update Hari Hara Veera Mallu Release Date Hari Hara Veera Mallu Release On Dasara Hari Hara Veera Mallu Movie

ఇవి కూడా చూడండి

Lokesh Kanagaraj Fight Club : ఫైట్​క్లబ్​తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్​గా మాత్రం కాదు

Lokesh Kanagaraj Fight Club : ఫైట్​క్లబ్​తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్​గా మాత్రం కాదు

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!

Ram Charan: ‘ఓటు’ కోసం షూటింగ్ ఆపేసిన చరణ్, ఇంటికి తిరుగు ప్రయాణం

Ram Charan: ‘ఓటు’ కోసం షూటింగ్ ఆపేసిన చరణ్, ఇంటికి తిరుగు ప్రయాణం

Mahesh Babu Animal Trailer: ‘యానిమల్’లో రణబీర్‌కు బదులు మహేష్ నటిస్తే, ఇదిగో ఇలా ఉంటుందట, డీప్ ఫేక్ వీడియో వైరల్

Mahesh Babu Animal Trailer: ‘యానిమల్’లో రణబీర్‌కు బదులు మహేష్ నటిస్తే, ఇదిగో ఇలా ఉంటుందట, డీప్ ఫేక్ వీడియో వైరల్

Rules Ranjann: ‘రూల్స్ రంజన్’ ఓటీటీ అప్డేట్ - ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అంటే?

Rules Ranjann: ‘రూల్స్ రంజన్’ ఓటీటీ అప్డేట్ - ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అంటే?

టాప్ స్టోరీస్

Telangana Election Polling Updates: తెలంగాణలో ఓట్ల జాతర- 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు

Telangana Election Polling Updates: తెలంగాణలో ఓట్ల జాతర- 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు

Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం

Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!

Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!