![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pawan Kalyan: సినిమా మేం తీస్తే, టికెట్లు మీరు అమ్ముతారా... సిని ఇండస్ట్రీ జోలికి వస్తే ఊరుకోను .. ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న అగ్ర హీరో పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు.
![Pawan Kalyan: సినిమా మేం తీస్తే, టికెట్లు మీరు అమ్ముతారా... సిని ఇండస్ట్రీ జోలికి వస్తే ఊరుకోను .. ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు Pawan kalyan fires on ap govt about cinema industry restrictions Pawan Kalyan: సినిమా మేం తీస్తే, టికెట్లు మీరు అమ్ముతారా... సిని ఇండస్ట్రీ జోలికి వస్తే ఊరుకోను .. ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/25/98a40483bdb77f47fd217c9492f04ff9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హీరో సాయి ధరమ్ తేజ్ ఇంకా కళ్లు తెరవలేదని చెప్పారు. సాయితేజ్ ఆసుపత్రిలో ఉన్నందువల్లే ఈ కార్యక్రమానికి వచ్చానన్నారు.
కోడికత్తి కేసుపై ఎందుకు ప్రశ్నించడంలేదు
రిపబ్లిక్ సినిమా ప్రి రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై చాలా మంది అవాస్తవాలు ప్రచారం చేశారని ఆవేదన చెందారు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై వచ్చిన కొన్ని కథనాలు కలిచివేశారన్నారు. కోడికత్తి కేసు, వైఎస్ వివేకానందారెడ్డి హత్యకేసులపై ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు.
Pawan Kalyan slipper shot to Top Media Channels. 🔥#PawanKalyanForSDT | @PawanKalyan pic.twitter.com/1GRESkA7ad
— KingKalyanFC (@KingKalyanFC) September 25, 2021
సినిమాలకు కులం ఆపాదించడం సరికాదు
సినిమా మేం తీస్తే టికెట్లు మీరు అమ్ముతారా అంటూ పవన్ ప్రశ్నించారు. తాను అడ్డగోలుగా సంపాదించలేదని వ్యాఖ్యానించారు. సినిమాలకు కులం ఆపాదించడం ఏమిటమన్నారు. సినిమా వాళ్లు అని చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. తనపై కోపాన్ని చిత్ర పరిశ్రమపై చూపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో థియేటర్లు ఉంటే ఏపీలో ఎందుకు థియేటర్లు లేవని ప్రశ్నించారు. సీఎం అవుతానా లేదా అన్నది ముఖ్యం కాదన్నారు. తన సినిమాలు ఆపితే భయపడతానమో అనుకుంటున్నానన్నారు. ఏపీలో తన సినిమాలను టార్గెట్ చేస్తున్నారని పవన్ అన్నారు.
Also Read: ఇండస్ట్రీకి నా మీద కాన్ఫిడెన్స్ పోయింది.. దేవకట్టా కామెంట్స్!
ఏపీ ప్రభుత్వంపై విమర్శలు
ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ పై కోపంతో చిత్ర పరిశ్రమపై ఆధారపడిన వారిని ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. లక్ష కోట్ల కుంభకోణాలు చేసే వారికి రెండు వేల కోట్ల చిత్ర పరిశ్రమతో పోటీ ఏమిటని ప్రశ్నించారు. నానిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మాజీ ఎంపీ అయిన మోహన్ బాబు ఇప్పటికైనా స్పందించి వైసీపీ ప్రభుత్వంతో మాట్లాడాలని హితవు పలికారు.
Also Read: ఫ్యాన్స్‌పై పవన్ కల్యాణ్ అసంతృప్తి! కనీసం కారు కూడా దిగలేక.. చివరికి..
సినిమా పరిశ్రమపై కుట్ర
ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీపై వచ్చే ఆదాయాన్ని చూపించి బ్యాంకుల్లో అప్పులు తీసుకునేందుకు కుట్ర చేస్తుందని పవన్ వ్యాఖ్యానించారు. సినిమా పెద్దలు తమ హక్కులను కోల్పోవద్దని పవన్ కల్యాణ్ సూచించారు. టాక్స్ కట్టే సినిమా వాళ్లు టాక్స్ కట్టని, కుంభకోణాలు చేసే వైసీపీ నేతలకు భయపడుతున్నారని ఆరోపించారు. లక్షల మంది కార్మికుల పొట్టకొడుతుంటే ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు. సినిమా పరిశ్రమతో పెట్టుకుంటే కాలిపోతారని పవన్ మండిపడ్డారు.
Gutsy leader love you @PawanKalyan Sir 🙏🏾
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) September 25, 2021
#PawanKalyanForSDT
pic.twitter.com/1KZ2rZzpXH
Also Watch: త్రివిక్రమ్‌కు పవన్ కల్యాణ్ ప్రత్యేక బహుమతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)