Pawan Kalyan OG Glimpse: పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా... బర్త్‌డే పవన్‌ది... గ్లింప్స్ విలన్‌ది... చివర్లో కిక్కిచ్చే పవర్ స్టార్ లుక్కు!
Emraan Hashmi OG Glimpse: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'ఓజీ' సినిమా నుంచి ఓ గ్లింప్స్ వచ్చింది. అందులో విలన్ ఇమ్రాన్ హష్మీని పరిచయం చేయగా... చివర్లో పవన్ లుక్కు సూపర్ ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు 'ఓజీ' (OG Movie) టీమ్ డబుల్ బొనాంజ అందించింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఉదయం (సెప్టెంబర్ 2న) శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్ విడుదల చేసింది. అందులో వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్ అభిమానులతో పాటు ప్రేక్షకులను అలరించింది. ఇక సాయంత్రం మరో వీడియో గ్లింప్స్ విడుదల చేసింది.
View this post on Instagram
లవ్ ఒమీ... విలన్ గ్లింప్స్ వచ్చింది!
సెప్టెంబర్ 2న ఉదయం పవన్ బర్త్ డే పోస్టర్ విడుదల చేసిన టీమ్... సాయంత్రం 'హ్యాపీ బర్త్ డే ఓజీ - లవ్ ఒమీ' పేరుతో గ్లింప్స్ విడుదల చేసింది.
'ఓజీ' సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్న సంగతి ఫ్యాన్స్, ఆడియన్స్ అందరికీ తెలుసు. ఆయన క్యారెక్టర్ పేరు ఒమీ. ఆ పాత్రను పరిచయం చేయడంతో పాటు లుక్స్, మేనరిజమ్స్ చూపించారు. 'డియర్ ఓజీ... నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నాను. నీ ఒమీ' అని ఇమ్రాన్ హష్మీ ఓ డైలాగ్ చెప్పారు. 'హ్యాపీ బర్త్ డే ఓజీ' అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఒమీ క్యారెక్టర్ క్రూయల్‌గా ఉంటుందని ఆ విజువల్స్ చూస్తే అర్థం అవుతోంది.
Also Read: అషు రెడ్డి ఒంటిపై పచ్చబొట్టు... పవన్ కళ్యాణ్ టాటూను చూపించిన బిగ్ బాస్ బ్యూటీ
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (Pawan Kalyan Birthday) నాడు విలన్ విజువల్స్ ఏమిటి? అని గ్లింప్స్ ప్రారంభంలో కొందరు అనుకున్నా... చివరలో వచ్చిన పవన్ లుక్ కిర్రాక్ అనేలా ఉంది. 'నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా' సాంగ్ విజువల్స్ గుర్తు ఉన్నాయా? అందులో వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంటులో లుక్ సరిగా రివీల్ చేయకుండా సస్పెన్సులో ఉంచారు కదా! ఆ లుక్ ఇప్పుడు విడుదల చేశారు. ఫ్యాన్స్ అందరితో పాటు ప్రేక్షకులు సైతం 'వావ్' అనేలా ఉందీ లుక్.
Also Read: మళ్ళీ వార్తల్లో మృణాల్ ఠాకూర్... అనుష్క మీద కామెంట్స్... మండిపడుతున్న బాలీవుడ్ ఆడియన్స్!
View this post on Instagram
'ఓజీ' మీద రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ప్రతి పోస్టర్, ప్రతి గ్లింప్స్ ప్రేక్షకుల చూపును కట్టిపడేశాయి. సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. సెప్టెంబర్ 25న పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అర్జున్ దాస్ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీత దర్శకుడు. 'ఓజీ' చిత్రానికి ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్ - మనోజ్ పరమహంస, కూర్పు: నవీన్ నూలి.





















