By: ABP Desam | Updated at : 28 Mar 2022 05:00 PM (IST)
క్రిస్ రాక్ మీద చేయి చేసుకున్న విల్ స్మిత్
Will Smith Wins Oscar for King Richard: లైవ్‌లో ఆస్కార్స్ 2022 చూస్తున్న వీక్షకులకు ఈ అవార్డు వేడుక ఎప్పటికీ గుర్తు ఉంటుంది. సినిమా అభిమానులు సైతం గుర్తు పెట్టుకుంటారు. దీనికి కారణం విల్ స్మిత్! 'కింగ్ రిచర్డ్' సినిమాలో నటనకు గాను ఆస్కార్స్‌లో ఆయన్ను ఉత్తమ నటుడు పురస్కారం వరించింది. ఈ వేడుక గుర్తు పెట్టుకోవడానికి కారణం అవార్డు కాదు, ఆయన ప్రవర్తన! లైవ్‌లో స్టేజి మీద హాస్య నటుడు క్రిస్ రాక్ మీద ఆయన చేయి చేసుకున్నారు. తొలుత కామెడీ కోసం చేశారని అనుకున్నా... తర్వాత సీరియస్ అని అర్థం అయ్యింది. దాంతో టీవీలో వేడుక చూస్తున్న వీక్షకులు మాత్రమే కాదు, అక్కడ స్టేజి ముందు ఉన్న సెలబ్రిటీలు సైతం షాక్ అయ్యారు. అసలు, ఈ గొడవకు కారణం ఏంటంటే...
Will Smith slaps Chris Rock for joke about wife Jada Pinkett Smith: విల్ స్మిత్ భార్య జేడా పింకెట్ స్మిత్ గుండు చేయించుకున్నారు. అందుకని, ఆమె 'జి.ఐ. జేన్' (అమెరికన్ వార్ డ్రామా మూవీ. అందులో ప్రధాన పాత్రధారి గుండుతో కనిపిస్తారు) లా కనిపిస్తున్నారని క్రిస్ రాక్ జోక్ చేశారు. దాంతో విల్ స్మిత్‌కి కోపం వచ్చింది. స్టేజి మీదకు వెళ్లి క్రిస్ రాక్ మీద చేయి చేసుకున్నారు. ఇది స్క్రిప్ట్ లో భాగం ఏమో, కామెడీ కోసం చేస్తున్నారేమోనని భావించారంతా! స్టేజి దిగిన తర్వాత 'నా భార్య పేరును నీ నోటి నుండి రానివ్వకు' అని విల్ స్మిత్ గట్టిగా అరిచారు. దాంతో మేటర్ సీరియస్ అని అర్థం అయ్యింది.
Also Read: నటుడిగా స్మిత్, నటిగా జెస్సికా, 'డ్యూన్'కు అవార్డుల పంట - ఆస్కార్స్ 2022 విజేతలు వీరే
Will Smith apologizes to oscars academy: 'కింగ్ రిచర్డ్' సినిమాలో నటనకు గాను విల్ స్మిత్ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. అవార్డు స్వీకరించడం కోసం స్టేజి ఎక్కిన స్మిత్... ఆస్కార్స్ అకాడమీకి క్షమాపణలు చెప్పారు. నామినేషన్ అందుకున్న మిగతా సభ్యులకు కూడా! క్రిస్ రాక్ మీద చేయి చేసుకున్నందుకు ఆయన ఆ మాట చెప్పారు. అవార్డు అందుకోవడం అందమైన అనుభూతి అని, అవార్డు గెలిచినందుకు తానేమీ ఏడవడం లేదని విల్ స్మిత్ పేర్కొన్నారు.
Also Read: 'నాకు ఎవడి దోస్తీ అక్కర్లేదు' - 'కేజీఎఫ్2' ట్రైలర్ వచ్చేసిందోచ్
Here's the moment Chris Rock made a "G.I. Jane 2" joke about Jada Pinkett Smith, prompting Will Smith to punch him and yell, "Leave my wife’s name out of your f--king mouth." #Oscars pic.twitter.com/kHTZXI6kuL
— Variety (@Variety) March 28, 2022
Best Actor in a Leading Role goes to Will Smith for his incredible performance in 'King Richard' Congratulations! #Oscars pic.twitter.com/y0UTX48214
— The Academy (@TheAcademy) March 28, 2022
Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?
Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?
చీర కట్టుకుంటా, బీచ్‌లో బికినీ వేసుకుంటా - ట్రోలర్స్‌కు పూనమ్ కౌర్ దిమ్మతిరిగే ఆన్సర్!
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్
Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..
Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్ పెంచేస్తున్న రాశీ ఖన్నా