OG - Saaho Connection: పవన్ ఓజీ x ప్రభాస్ సాహో... రెండిటినీ కనెక్ట్ చేసిన సుజీత్ - లింక్ ఏమిటంటే?
OG x Saaho: రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' చేశాడు దర్శకుడు సుజీత్. రెండిటి మధ్య కనెక్షన్ పెట్టాడు. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేశాడు.

'రన్ రాజా రన్'తో సుజీత్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ వెంటనే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సినిమా చేసే ఛాన్స్ కొట్టేశారు. అదీ 'బాహుబలి 2' వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత. ఇప్పుడు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌తో 'ఓజీ' చేశాడు. తీసింది మూడు సినిమాలే అయినప్పటికీ... ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రెండు సినిమాలను కనెక్ట్ చేశాడు. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ (Sujeeth Cinematic Universe) అనౌన్స్ చేశాడు.
'ఓజీ'లో పవన్ నోటి వెంట వాజీ సిటీ గురించి!
How Prabhas Saaho and Pawan Kalyan OG connected?: ప్రభాస్ 'సాహో' గుర్తు ఉందా? ఆ సినిమాలో సిద్ధార్థ్ నందన్ సాహో పాత్రలో ఆయన నటించారు. వాజీ సిటీ నుంచి వరల్డ్ బిగ్గెస్ట్ క్రైమ్ సిండికేట్ రన్ చేసే రాయ్ గ్రూప్ కంపెనీ ఛైర్మన్ నరాంతక్ రాయ్ నందన్ కుమారుడి పాత్ర అది. తండ్రి మరణం తర్వాత కంపెనీని చేజిక్కించుకోవడం కోసం సాహో ఏం చేశాడు? అనేది సినిమా. అయితే ఆ కథకు 'ఓజీ'ని లింక్ చేశాడు సుజీత్! ఎలా? అంటే...
Also Read: 'ఓజీ' రివ్యూ: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందా? సినిమా హిట్టా? ఫట్టా?
'సాహో' సినిమాలో ప్రపంచానికి తెలియకుండా తన కుమారుడు సిద్ధార్థ్ నందన్ సాహోని పెంచుతాడు రాయ్. ముంబై నుంచి వాజీ వెళ్లిన తర్వాత తన కుమారుడి ఆనవాళ్లు ఎవరికీ తెలియకుండా చూస్తాడు. క్రైమ్ సిండికేట్ రన్ చేసే రాయ్ లాంటి వ్యక్తిని ఓమీ భాయ్ భయపెట్టినట్టు 'ఓజీ'లో చూపించారు. పవన్ కళ్యాణ్ నోటి వెంట ఆ డైలాగ్ చెప్పించారు. జాకీ ష్రాఫ్, మలయాళ నటుడు లాల్... 'సాహో'లో మెయిన్ క్యారెక్టర్లు చేసిన ఇద్దరినీ 'ఓజీ'లో చూపించారు దర్శకుడు సుజీత్.
విలన్ కనెక్షన్ ఉంది... మరి హీరోలు!?
'సాహో' కథకు, 'ఓజీ'లో విలన్ ఓమీ పాత్రకు కనెక్షన్ ఉన్నట్టు డైరెక్టర్ సుజీత్ చూపించారు. విలన్ పరంగా రెండు సినిమాల మధ్య సంబంధం ఉందన్నమాట. మరి హీరోల మధ్య సంబంధం ఉన్నట్టు చూపిస్తారా? కాలమే ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి.
'ఓజీ' విడుదలకు కొన్ని గంటల ముందు సుజీత్ ఒక లెటర్ రిలీజ్ చేశాడు. ఆ లేఖ చివరలో 'SCU'ను హైలైట్ చేశాడు. లేఖలో రాసింది ఏమైనా కావచ్చు. కానీ, ఆ అక్షరాలకు అసలైన అర్థం సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ అన్నమాట. ప్రభాస్, పవన్ కళ్యాణ్ 'ఎస్' అంటే ఇద్దరితో మల్టీస్టారర్ సినిమా చేయడానికి సుజీత్ రెడీ. గతంలో ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్, పవన్ హీరోలుగా సినిమా చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
Also Read: 'ఓజీ' @ 100 కోట్లు... పవన్ వసూళ్ల వేట... బాక్సాఫీస్‌లో బీభత్సం!





















