OG Collection: 'ఓజీ' @ 100 కోట్లు... పవన్ వసూళ్ల వేట... బాక్సాఫీస్‌లో బీభత్సం!
OG Joins 100Cr Club: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వసూళ్ల వేట మొదలైంది. బాక్స్ ఆఫీస్ బరిలో రికార్డుల ఊచకోతకు రంగం సిద్ధమైంది. ఆల్రెడీ 'ఓజీ' వంద కోట్ల క్లబ్బులో చేరింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేంజ్ ఏమిటనేది యంగ్ జనరేషన్ ఆడియన్స్‌కు సైతం తెలిసేలా చేసిన సినిమా 'ఓజీ' (OG Movie). అమెరికా నుంచి అమలాపురం వరకు, ధూల్ పేట్ నుంచి డల్లాస్ & దుబాయ్ వరకు... ఎక్కడ, ఎటు చూసినా సరే థియేటర్లలో 'ఓజీ' మేనియా కనబడుతోంది. ఇప్పుడీ సినిమా రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ నంబర్స్ నమోదు చేసేందుకు రెడీ అయ్యింది. థియేటర్లలో ఫస్ట్ షో పడక ముందు వంద కోట్ల క్లబ్బులో చేరిందీ సినిమా.
వంద కోట్ల క్లబ్బులో 'ఓజీ'
OG Joins 100Cr Club: థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్స్ పడకముందే 'ఓజీ' మూవీ వంద కోట్ల క్లబ్బులో చేరింది. వరల్డ్ వైడ్ ఈ సినిమా ప్రీ సేల్స్ వంద కోట్లు క్రాస్ చేశాయి. అమెరికాలో 'ఓజీ' దూకుడు కంటిన్యూ అవుతోంది. అక్కడ మూడున్నర మిలియన్ డాలర్స్ మార్క్ చేరుకుంది. ఒక్క ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ మూవీ గ్రాస్ 35 కోట్లకు పైగా వచ్చింది.
హైదరాబాద్... నయా రికార్డ్!
తెలంగాణలోని హైదరాబాద్ సిటీలో భారీ ఎత్తున 'ఓజీ' పెయిడ్ ప్రీమియర్ షోలు పడుతున్నాయి. సిటీలో నయా రికార్డ్ క్రియేట్ చేసిందీ సినిమా. ప్రజెంట్ ఈ మూవీ ప్రీ సేల్స్ ఆల్మోస్ట్ 20 కోట్లు. నైజాంలో 'ఓజీ' ప్రీ సేల్స్ 30 కోట్లుకు పైగా రాగా, ఒక్క హైదరాబాద్ సిటీలో 20 కోట్లు వచ్చాయంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలోనూ 'ఓజీ' ప్రీమియర్ షోలు పడుతున్నాయి. అక్కడ కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అక్కడ సినిమా కలెక్షన్స్ 30 కోట్లు వచ్చాయని టాక్.
Also Read: ఓజీ ఫస్ట్ రివ్యూ... పవన్ ఎలివేషన్ పీక్స్, యాక్షన్ బ్లాస్ట్ అంతే - అభిమానులకు పండగ
వరల్డ్ వైడ్ 'ఓజీ' ప్రీ సేల్స్ వంద కోట్లు దాటాయి. మొదటి రోజు ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా 'ఓజీ' రికార్డ్ క్రియేట్ చేయడం గ్యారంటీ అని చెబుతున్నారు. ఫస్ట్ టైమ్ పవన్ కెరీర్‌లో మొదటి రోజు వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీగా 'ఓజీ' చరిత్రకు ఎక్కుతుంది. హిట్ టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టం ఏమీ కాదు.
Also Read: ఓజీ vs వీరమల్లు... పవర్ స్టార్‌తో పవన్ కళ్యాణ్‌కే పోటీ... బిజినెస్‌లో ఇంత డిఫరెన్స్ ఏంటి సామి!





















