OG Movie Sequel: 'ఓజీ' సీక్వెల్ ఉందండోయ్... అప్పుడే అయిపోయిందనుకోకు, జపాన్‌లో ఊచకోత!
They Call Him OG Part 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ఓజీ'. థియేటర్లలో సినిమా విడుదలైంది. అయితే కథ ఒక్క సినిమాతో ముగిసిందని అనుకోకువద్దు. దీనికి పార్ట్ 2 కూడా ఉంది

అప్పుడే అయిపోయిందనుకోకు... ఇప్పుడే మొదలైంది ఇప్పుడే మొదలైంది - గబ్బర్ సింగ్ సినిమాలో విలన్ అభిమన్యు సింగ్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇచ్చిన వార్నింగ్ డైలాగ్. 'ఓజీ' (OG Movie) థియేటర్లలో నుంచి బయటకు వచ్చిన తర్వాత సేమ్ డైలాగ్ గుర్తుకు రావచ్చు. ఎందుకంటే... సినిమా అయిపోలేదు ఇంకా ఉంది.
జపాన్ వెళ్లిన ఓజీ... సీక్వెల్ ఉందండోయ్!
OG Movie Sequel: పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఆయన వీరాభిమాని సుజీత్ దర్శకత్వం వహించిన 'ఓజీ' సినిమాకు సీక్వెల్ ఉంది. బుధవారం రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా సినిమా విడుదలైంది. అమెరికా నుంచి మొదలు పెడితే ఆంధ్ర వరకు పలు ప్రాంతాలలో రాత్రి 10 గంటలకు షోలు పడ్డాయి. ఎండింగ్ అందరినీ హుక్ చేసింది. వై? ఎందుకు? అంటే... సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు కనుక!
'ఓజీ' కథ జపాన్‌లో ప్రారంభమైంది. చిన్న వయసులో ఓజాస్ గంభీర జపాన్ నుంచి ఇండియా వచ్చేస్తాడు. అక్కడ సత్యా దాదాకు అండగా నిలబడతాడు. అతడికి కష్టం వస్తే తీరుస్తాడు. ఇండియాలో సమస్యను గంభీర సాల్వ్ చేస్తాడు. దాంతో సినిమా ముగిసింది. అయితే కథ ముగియలేదు. 15 ఏళ్లు ముంబైకి దూరంగా ఉన్న గంభీర మధ్యలో జపాన్ వెళ్లి వచ్చాడు. అక్కడ యాకూజ గ్యాంగ్‌స్టర్స్ అందరినీ ఊచకోత కోశాడు. అది పార్ట్ 2లో చూపించబోతున్నారు.
Also Read: 'ఓజీ' రివ్యూ: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందా? సినిమా హిట్టా? ఫట్టా?
సినిమా ముగిసిన తర్వాత పార్ట్ 2 అనౌన్స్ చేశారు దర్శకుడు సుజీత్. జపాన్ వెళ్లిన గంభీర యాకూజాలను ఎలా ఊచకోత కోశాడు? అనేది అందులో చూపించే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ లుక్స్, యాక్షన్ సీక్వెన్సులను అందించిన సినిమాగా చెప్పవచ్చు. అభిమానులకు ఈ సినిమా పండగ. అయితే ఈ సినిమా తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల కానుంది. దాంతో పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో సీక్వెల్ అనౌన్స్ చేశారు ఫ్యాన్ బాయ్ సుజీత్. మరి ఆ సినిమాకు పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తారో చూడాలి.
Also Read: 'ఓజీ' @ 100 కోట్లు... పవన్ వసూళ్ల వేట... బాక్సాఫీస్‌లో బీభత్సం!





















