అన్వేషించండి

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు కిర్రాక్ అప్డేట్... 'ఓజీ'లో ఫస్ట్ సాంగ్ పాడిన శింబు

OG Movie First Single: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సంగీత దర్శకుడు తమన్ కిర్రాక్ అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ సింగిల్ ఎవరు పాడారో చెప్పారు. శింబుతో ఫోటో షేర్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు కిర్రాక్ అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్ (Music Director Thaman)! 'ఓజీ' సినిమా (OG Movie First Single)లో ఫస్ట్ సింగిల్ గురించి ఆయన ఓ విషయం చెప్పేశారు. అది కొన్నాళ్ల నుంచి వినిపిస్తున్న వార్తే. ఇప్పుడు అఫీషియల్ చేసేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

పవన్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన శింబు!
పవర్ స్టార్ పవన్ కథానాయకుడిగా ఆయన డై హార్డ్ ఫ్యాన్ సుజిత్ రూపొందిస్తున్న సినిమా 'ఓజీ' (They Call Him OG). ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఇందులో టైటిల్ సాంగ్ కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడారు. ఆయనతో తమన్, సుజిత్ కలిసి ఫోటో దిగారు. ఆ స్టిల్ ట్వీట్ చేశారు తమన్. 

సాంగ్ రెమ్యునరేషన్ తీసుకోలేదు...
ముందే విరాళం ప్రకటించేసిన శింబు!
పవన్ కళ్యాణ్ సినిమాలో శింబు పాట పాడుతారు అనేది కొన్ని రోజుల క్రితమే బయటకు వచ్చింది. ఎందుకంటే... ఏపీ, తెలంగాణలో ఇటీవల తలెత్తిన వరద విపత్తు సహాయక చర్యల కోసం శింబు విరాళం ప్రకటించారు. 'ఓజీ' (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్) సినిమాలో సాంగ్ పాడినందుకు గాను రెమ్యూనరేషన్ ఇవ్వబోతే ఆయన ససేమిరా వద్దని చెప్పేశారు‌. అక్కడికి నిర్మాతలు బలవంతం చేయడంతో ఆ డబ్బులను తెలుగు ప్రజల కోసమే విరాళంగా ఇచ్చేసి తన మంచి మనసు చాటుకున్నారు శింబు. అది సంగతి! 

Also Read: గిన్నిస్ రికార్డుల్లో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పేరు... తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబురం

త్వరలో సాంగ్ రిలీజ్ చేస్తారా?
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా 'ఓజీ' సినిమాలో సాంగ్ విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ సాంగ్ ఎప్పుడు విడుదల చేస్తాం అనేది సెప్టెంబర్ రెండున అప్డేట్ ఇస్తామని కూడా ముందు చెప్పారు. అయితే... ఏపీలో అనూహ్యంగా కురిసిన భారీ వర్షాలు, ఆ నీటి వరదకు ప్రజలు ఇబ్బంది పడడంతో ఓజీ అప్డేట్స్ కాదు కదా పవన్ సినిమాలకు సంబంధించిన ఏ అప్డేట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. దాంతో అప్పుడు సాంగ్ రిలీజ్ ఆగింది. ఇప్పుడు ఫ్యాన్స్ ఆ విషయం గుర్తు చేస్తూ త్వరలో ఏమైనా సాంగ్ విడుదల చేస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

Also Read: ఫ్యాన్స్‌తో పాటూ నేనూ బాధ పడుతున్నా, నాది పెద్ద బాధ - 'దేవర' ప్రీ రిలీజ్ క్యాన్సిల్‌, ఎన్టీఆర్ మెసేజ్

పవన్ కళ్యాణ్ హీరోగా ముంబై మాఫియా నేపథ్యంలో సుజిత్ రూపొందిస్తున్న యాక్షన్ డ్రామా 'ఓజీ'లో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద అగ్ర నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్న చిత్రమిది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Embed widget