అన్వేషించండి

Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?

Black Movie Review: ‘రంగం’తో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న జీవా ఇటీవలే ‘బ్లాక్’ అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌తో మళ్లీ హిట్ కొట్టాడు. ఇంతకీ సినిమా ఎలా ఉంది?

Black Movie OTT Review: తమిళ హీరో జీవా (Jiiva) ‘రంగం’తో తెలుగులో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత జీవాకి సరైన హిట్ పడలేదు. ఇన్నాళ్లకి ‘బ్లాక్’ అనే తమిళ సినిమాతో థియేటర్ల దగ్గర హిట్ కొట్టాడు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. తమిళ ప్రేక్షకులకు కనెక్ట్ అయిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా? అసలు ఈ థ్రిల్లర్‌లో అంత బ్లాక్‌బస్టర్ ఎలిమెంట్స్ ఏం ఉన్నాయి?

కథ: 1964లో కథ ప్రారంభం అవుతుంది. గణేష్ (రాజా రుద్రకోడి), లలిత (సింధూరి) ప్రేమించుకుంటారు. కానీ వారి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో పెళ్లికి సాయం చేయమని స్నేహితుడు మనోహర్‌ను (వివేక్ ప్రసన్న) కోరతారు. మనోహర్ వారిద్దరినీ చెన్నైలోని బీచ్‌కు సమీపంలో ఉన్న తన విల్లాలో ఉంచి తర్వాతి రోజు ఉదయం పెళ్లి చేయాలనుకుంటాడు. కాలేజీ రోజుల్లో మనోహర్ కూడా లలితను ప్రేమిస్తాడు. కానీ ఆమె గణేష్‌ను ప్రేమించిందని ఉక్రోషం పెంచుకుంటాడు. అక్కడి నుంచి బయల్దేరి వెళ్లిపోయాక దారిలో వారిని చంపేయాలని గన్ తీసుకుని మళ్లీ వెనక్కి వస్తాడు. కానీ మనోహర్ వచ్చేసరికి వాళ్లని ఎవరో గన్‌తో కాల్చేసి ఉంటారు. షాక్ అయి మనోహర్‌ని ఏం జరిగిందని అడుగుతాడు. అప్పుడు మనోహర్... గణేష్ చెవిలో చెప్పిన సమాధానం విని షాక్ అవుతాడు.

60 సంవత్సరాలు గడిచాక అదే ప్రాంతంలో కట్టిన విల్లాను వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) కొనుక్కుంటారు. వీకెండ్‌లో సరదాగా ఒకరోజు అక్కడ గడుపుదాం అని విల్లా రెడీ అవ్వకముందే వస్తారు. విల్లాల్లో దిగిన ఫస్ట్ కస్టమర్లు మీరే అని అక్కడి మేనేజ్‌మెంట్ సిబ్బంది చెబుతారు. రాత్రి కాగానే అక్కడ విచిత్రమైన సంఘటనలు జరగడం మొదలవుతాయి. తమకు ఎదురుగా ఉన్న విల్లాలో ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. వెళ్లి చూస్తే అందులో కూడా వసంత్, అరణ్యలే ఉంటారు. అసలక్కడ ఏం జరిగింది? వీరికి ఎదురుగా ఉన్న విల్లాలో దిగింది ఎవరు? గణేష్, లలితలను చంపింది ఎవరు? అసలు ఆ ప్రాంతంలో ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ: 2013లో వచ్చిన ‘కోహరెన్స్’ అనే సినిమాకు అడాప్టేషన్‌గా ‘బ్లాక్’ను తెరకెక్కించాడు దర్శకుడు కేజీ బాలసుబ్రమణి. కోర్ సైన్స్ ఫిక్షన్ థీమ్‌లో మార్పులు చేయకపోయినా చుట్టుపక్కల ఉండే ఎలిమెంట్స్‌లో చాలా మార్పులు చేశాడు. నిజానికి ఒరిజినల్‌లో ఎనిమిది మంది ఫ్రెండ్స్‌కు ఈ సంఘటనలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఒక జంట మాత్రమే ఉంటుంది. ఇండియన్ ఆడియన్స్ నేటివిటీకి తగ్గట్లు ఇలా చాలా మార్పులు ఉన్నాయి. కాబట్టి ఒరిజినల్ చూసిన వారికి ఒక కొత్త ఫీలింగ్ కలుగుతుంది.

సినిమా చాలా ఇంట్రస్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది. పీరియాడిక్ పోర్షన్లతోనే సినిమా మీద ఇంట్రస్ట్ పెరుగుతుంది. కథ 2024కు షిఫ్ట్ అయ్యాక కాస్త స్లో అవుతుంది. జీవా, ప్రియా భవానీ శంకర్‌లు విల్లాకు వచ్చే వరకు జరిగే 20 నిమిషాల ఎపిసోడ్‌లో కథకు కీలకం అయ్యేవి ఏమీ ఉండవు. దీంతో కాస్త డీవియేషన్ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ విల్లాకు వచ్చాక నైట్ అవ్వగానే కథ ఊపందుకుంటుంది. ముఖ్యంగా సస్పెన్స్ రివీల్ అయ్యే సీన్లు బాగా డిజైన్ చేశారు.

సరిగ్గా 60 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది? విల్లాలు కట్టకముందు ఆ ప్రాంతంలో ఏం జరిగింది అని రివీల్ చేసే సమయంలో సైన్స్ ఫిక్షన్ డిటైల్స్ సరిగ్గా చెప్పలేకపోతే ఆడియన్స్‌కు అర్థం అవ్వకుండా పోయే అవకాశం ఉంది. కానీ వాటన్నిటినీ బాగా డీల్ చేశారు. ముఖ్యంగా క్లైమ్యాక్స్ అయితే సినిమాకు హైలెట్.

Also Readబఘీర రివ్యూ: ప్రశాంత్ నీల్ రాసిన బెంగళూరు బ్యాట్‌మ్యాన్ కథ - సినిమా ఎలా ఉంది?

శామ్ సీఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్. కొన్ని సీన్లను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. సినిమా రన్ కేవలం ఒక గంటా 58 నిమిషాలు మాత్రమే. ఇలాంటి ఎక్స్‌పెరిమెంటల్ సైన్స్‌ఫిక్షన్ సినిమాకు ఇది పర్‌ఫెక్ట్ రన్‌టైమ్.

ఇక నటీనటుల విషయానికి వస్తే... సినిమాలో ప్రధాన పాత్రలు రెండే. జీవా, ప్రియా భవాని శంకర్ తమ పాత్రలకు పర్‌ఫెక్ట్‌గా జస్టిస్ చేశారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... ఓటీటీలో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లేదా సైన్స్‌ఫిక్షన్ సినిమా చూడాలనుకుంటే ‘బ్లాక్’ మిమ్మల్ని ఏ మాత్రం నిరాశ పరచదు. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫాంలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో అందుబాటులో లేదు కానీ సబ్‌టైటిల్స్‌లో సినిమా ఎంజాయ్ చేయవచ్చు.

Also Readఅమరన్ రివ్యూ: నటనతో ఏడిపించిన సాయి పల్లవి... ఆర్మీ అధికారిగా శివకార్తికేయన్ ఎలా చేశారు? సినిమా ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Embed widget