అన్వేషించండి

Bagheera Review: బఘీర రివ్యూ: ప్రశాంత్ నీల్ రాసిన బెంగళూరు బ్యాట్‌మ్యాన్ కథ - సినిమా ఎలా ఉంది?

Srii Murali Bagheera Review: శ్రీ మురళి హీరోగా నటించిన ‘బఘీర’ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. ఈ సినిమా ఎలా ఉంది?

Prashanth Neel Bagheera Review in Telugu
సినిమా రివ్యూ: బఘీర
రేటింగ్: 2.25/5
నటీనటులు: శ్రీ మురళి, రుక్మిణి వసంత్, గరుడ రామ్, ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్ తదితరులు 
కథ: ప్రశాంత్ నీల్
ఛాయాగ్రహణం: ఏజే శెట్టి
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
నిర్మాత: విజయ్ కిరగందూర్
రచన, దర్శకత్వం: డాక్టర్ సూరి
విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024

Bagheera Review in Telugu: కన్నడ హీరో శ్రీ మురళి హీరోగా, ప్రశాంత్ నీల్ కథ అందించిన భారీ యాక్షన్ మూవీ ‘బఘీర’. హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది. హ్యాపెనింగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ శ్రీ మురళి సరసన నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను కూడా వయొలెంట్ యాక్షన్‌తో నింపేశారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది?

కథ: చిన్నప్పుడు తల్లి చెప్పిన కథలు విని జనాలకు మంచి చేయాలని పోలీస్ అవుతాడు వేదాంత్ (శ్రీమురళి). అతని తండ్రి (అచ్యుత్ ప్రసాద్) కూడా పోలీసే. కర్ణాటకలోని మంగుళూరులో ఛార్జ్ తీసుకున్న వెంటనే క్రిమినల్స్‌ను ఏరి పారేయడం మొదలు పెడతాడు. దీంతో పై అధికారులు అతన్ని పిలిచి ఎక్కువ దూకుడుగా వెళ్లవద్దని బెదిరిస్తారు. తనకు సొంతూరులో పోస్టింగ్ రావడానికి కూడా తండ్రి రూ.50 లక్షలు లంచం ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో వేదాంత్ కుంగిపోతాడు. ఊళ్లో జరిగే నేరాలను పట్టించుకోవడం మానేస్తాడు.

కానీ కొందరు రౌడీలు అత్యాచారం చేసిన ఒక అమ్మాయి వేదాంత్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడుతుంది. దీంతో వేదాంత్ కొత్త బాట పడతాడు. సిటీలో ఉండే రౌడీలు, గూండాలు అందరి దగ్గరా లంచాలు తీసుకుంటూ డిపార్ట్‌మెంట్‌లో తనను తాను కరప్ట్ ఆఫీసర్‌లా ప్రచారం చేసుకుంటాడు. అదే క్రిమినల్స్‌ని రాత్రి పూట ‘బఘీర’గా వేటాడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే మంగుళూరు బేస్డ్‌గా పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ నడుస్తుందని తెలుసుకుంటాడు. దాని వెనక నొటోరియస్ క్రిమినల్ రాణా (గరుడ రామ్) ఉన్నాడని తెలుస్తుంది. తర్వాత వేదాంత్ ఏం చేశాడు? రాణాకు ఎదురెళ్లాక వేదాంత్ జీవితంలో వచ్చిన మార్పులేంటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: ఇండియన్ స్క్రీన్ మీద ‘విజిలాంటే’ (తనెవరో తెలియకుండా జనాలకు మంచి చేసే హీరో) కథలు చాలా తక్కువగా వస్తాయి. 2019లో వచ్చిన తమిళ సినిమా ‘హీరో (తెలుగులో శివ కార్తికేయన్ శక్తి)’, ఈ మధ్య తెలుగులో వచ్చిన నాని ‘సరిపోదా శనివారం’ ఈ తరహా సినిమాలే. ఇప్పుడు శ్రీమురళి నటించిన ‘బఘీర’ కూడా ఈ కోవలోకే వస్తుంది.

నగరంలో బాగా రెస్పాన్సిబుల్ ఒక వ్యక్తి మంచి ధనికుడై ఉండటం, అతను రాత్రి పూట నగరంలోని నేరస్తులను ఎదుర్కోవడం అనేది ‘బ్యాట్ మ్యాన్’ కథ. స్థూలంగా చూస్తే ‘బఘీర’ కూడా అదే కథ. హీరో సిటీలో పోలీసుగా మంచి పొజిషన్‌లో ఉంటాడు. మొదట కండ బలంతో నేరాలను ఆపుతాడు. తర్వాత తనకున్న ధనబలంతో టెక్నాలజీ వాడి నేరస్తుల ఆట కట్టిస్తూ ఉంటాడు. ట్రీట్‌మెంట్ సరిగ్గా ఉంటే ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తాయి. కానీ ‘బఘీర’ అక్కడ వెనకపడింది.

సినిమా ఫస్టాఫ్ చాలా స్లోగా ఉంటుంది. తల్లి మాటలు విని హీరో పోలీస్ అవ్వడం వరకు ఓకే. కానీ సిస్టంకు వ్యతిరేకంగా ‘విజిలాంటే’ అవ్వడానికి తనకు ఎదురైన పరిస్థితులు అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు. సిస్టంలో లేకుండా, అన్యాయానికి ఎదురెళ్లే అవకాశం లేనప్పుడు హీరో ఈ దారి ఎంచుకుంటే ఓకే కానీ పై అధికారుల ఒత్తిడి ఎదుర్కోలేక ఈ దారి ఎంచుకోవడం అంత కన్విన్సింగ్‌గా కూడా అనిపించదు. యాక్షన్ సీన్లు మాత్రం బాగా డిజైన్ చేశారు. ఫస్టాఫ్‌లో రేపిస్టులను చంపే యాక్షన్ సీన్ చాలా బాగా వచ్చింది. ఇంటర్వెల్ బ్లాక్‌ను కూడా బాగా డిజైన్ చేశారు.

అయితే సెకండాఫ్‌లో కూడా స్టోరీ అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. హీరో ఎవరో ప్రపంచానికి తెలియనప్పుడు... విలన్‌కు, హీరోకు మధ్య ఫేస్ ఆఫ్ త్వరగా ఎస్టాబ్లిష్ చేస్తే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఇంట్రస్టింగ్‌గా మారుతుంది. కానీ విలన్‌కి హీరో అనే వాడు ఒకడున్నాడు అని తెలిసేసరికే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. ఆ తర్వాత రెండు యాక్షన్ ఎపిసోడ్లతో సినిమా అయిపోతుంది. ఇందులో రుక్మిణి వసంత్ పాత్ర కూడా చాలా పేలవంగా ఉంది. హీరోయిన్ పాత్ర సరిగ్గా పాటకు ముందు వచ్చే సీన్‌లో కనిపిస్తుంది. తర్వాత మాయం అయిపోతుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే... ‘విజిలాంటే’ వేదాంత్‌గా శ్రీమురళి మెప్పిస్తాడు. మూడు సంవత్సరాల కాలం తను ఈ సినిమా మీదనే ఉన్నాడు. రుక్మిణి వసంత్ పాత్ర మరీ పేలవంగా ఉంది. తను చేయాల్సిన స్థాయి పాత్ర అయితే కాదు. విలన్‌గా గరుడ రామ్ స్క్రీన్‌పై క్రూరంగా కనిపిస్తాడు. హెడ్ కానిస్టేబుల్ పాత్రలో రంగాయణ రఘుకు మంచి పాత్ర దక్కింది. మిగతా పాత్రధారులందరూ ఓకే.

ఓవరాల్‌గా చెప్పాలంటే... ఈ ‘బఘీర’ కేవలం యాక్షన్ సీన్ల కోసం మాత్రమే.

Read Also: ఊహలకు అందని రీతిలో ‘కేజీఎఫ్ 3’... క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాకీ భాయ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget