CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Rushikonda Palace: ఓ వ్యక్తి విలాసం కోసం ఏ విధంగా కార్యక్రమాలు చేస్తాడనేది రుషికొండ భవనాలు చూశాకే తెలిసిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రుషికొండలో భవనాలను ఆయన పరిశీలించారు.
CM Chandrababu Comments On Rushikonda Palace: విశాఖ రుషికొండలో (Rushikonda) ఎవరూ ఊహించనిది జరిగిందని.. ఓ ముఖ్యమంత్రి విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకోవడం ఎక్కడా చూడలేదని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన భవనాలను మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శనివారం పరిశీలించారు. 'రుషికొండలో గుండె చెదిరిపోయే నిజాలు బయటకొస్తున్నాయి. ఇక్కడ ఎవరూ కలలో కూడా ఊహించనిది జరిగింది. ఓ వ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం ఏ విధంగా కార్యక్రమాలు చేస్తాడనేది ఇక్కడి భవనాలు చూశాకే తెలిసింది. గతంలో మీడియా, ఇతరులు ఎంత ప్రయత్నించినా రుషికొండపై ఏం చేస్తున్నారో తెలియకుండా చేశారు. ఎన్జీటీ, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాన్ని మభ్యపెట్టారు. ఓ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా చేయగలరో అనే దానికి ఇక్కడి పరిస్థితి ఓ ఉదాహరణ. నేను, నా మిత్రుడు పవన్ కల్యాణ్ కూడా ఇక్కడకు రావాలని ప్రయత్నించినా.. ఎవరినీ రానీయకుండా చేశారు. ఇవాళ ఇక్కడ ఏం జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ అధికారం మాకు ప్రజలే ఇచ్చారు. రుషికొండ విశాఖలోనే అందమైన ప్రాంతం. భవనాల్లో ఎక్కడ కూర్చున్నా సముద్రం వ్యూ కనిపించేలా కట్టారు. పూర్వం రాజులు, చక్రవర్తులు కూడా ఇలాంటి భవనాలు నిర్మించుకోలేదు.' అని చంద్రబాబు పేర్కొన్నారు.
'బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా.?'
తన విలాసాల కోసం, తానే ఇక శాశ్వత సియం అనే భ్రమతో, జగన్ రెడ్డి కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ లో, రూ.3 లక్షల వరకు ఖరీదు చేసే ఫ్యాన్సీ ఫ్యాన్లు #RushikondaPalace #ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/JuDBvsyuLL
— Telugu Desam Party (@JaiTDP) November 2, 2024
ఇలాంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికి వస్తారా ? అని ప్రజలు ఆలోచించాలి.
— Telugu Desam Party (@JaiTDP) November 2, 2024
పేదలు vs పెత్తందార్లు అంటాడు, పేదల సొమ్ముతో ఇలాంటి విలాసవంతమైన భవనాలు కట్టుకుంటాడు #RushikondaPalace #ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/kZtb4qSABJ
ప్రజాధనంతో ఇలాంటి భవనాలు కట్టుకోవడం దారుణమని.. బాత్ టబ్ కోసం రూ.36 లక్షలు ఖర్చు చేశారని, ఫ్యాన్సీ ఫ్యాన్లు పెట్టారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. 'భవనాలకు మార్బుల్స్ విదేశాల నుంచి తీసుకొచ్చారు. చాలా దేశాల్లో ఎంతో మంది నేతలను చూశాను. ఎవరూ ఇలాంటి ప్యాలెస్‌లు కట్టుకోలేదు. ఢిల్లీ పెద్దలు కూడా విశాఖలోని నేవీ గెస్ట్‌హౌస్‌లోనే ఉన్నారు. పర్యాటక శాఖ కోసమే నిర్మించామని అనేకసార్లు చెప్పారు. పేదలను ఆదుకుంటామనే వారు ఇలాంటివి కట్టుకుంటారా.?. గత ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు రూ.400 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఈ నిధులు ఖర్చు పెడితే రోడ్లపై గుంతలు పూడ్చడం పూర్తయ్యేది. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి పనికివస్తారా.? అనేది ప్రజలు ఆలోచించాలి. ఈ భవనాలను దేనికి వాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అధికారంలో శాశ్వతంగా ఉంటాననే భ్రమలతో ఇలాంటివి కట్టారు. విశాఖ ప్రజలను మోసం చేసేందుకు తప్పుడు పనులు చేశారు.' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.