OG Box Office Collections Day 2: 'OG' సరికొత్త రికార్డులు - 2 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి... పవర్ స్టార్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ హిట్
OG Collections: పవన్ కల్యాణ్ 'OG' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. రెండు రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

Pawan Kalyan's OG Movie Second Day Collections: పవన్ కల్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'OG' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ.154 కోట్ల గ్రాస్‌తో పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రెండో రోజు కాస్త కలెక్షన్స్ కాస్త నెమ్మదించినా ఇండియావ్యాప్తంగా కలెక్షన్లతో రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది.
రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
'OG' మూవీకి ఇండియావ్యాప్తంగా రెండు రోజుల్లో కలిపి రూ.104 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సంస్థ సాక్నిల్క్ వెల్లడించింది. ప్రీమియర్స్, ఫస్ట్ డే సందర్భంగా కలెక్షన్ల జోరు కొనసాగగా... రెండు రోజు కాస్త నెమ్మదించింది. ఫస్ట్ ప్రీమియర్లతో ఇండియాలో రూ.21 కోట్లు ఇక ఫస్ట్ డే గురువారం ఇండియావ్యాప్తంగా రూ.63.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూళ్లు సాధించాయి. ఇక రెండో రోజు ఇండియా వ్యాప్తంగా రూ.19.25 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు సంస్థ వెల్లడించింది.
మొత్తంగా 2 రోజుల్లోనే ఇండియాలో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి పవన్ కెరీర్‌లోనే ఆల్ టైం రికార్డు సృష్టించింది. తక్కువ టైంలోనే ఈ ఫీట్ సాధించిన పవన్ తొలి సినిమా ఇదే. ఇక శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం 41.57 % ఆక్యుపెన్సీ నమోదు కాగా ఈవినింగ్, నైట్ షోల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. ఇక ఫస్ట్ డే ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. పవన్ ఖాతాలో మరో సూపర్ హిట్ చేరిందని సంబర పడుతున్నారు. ఈ లెక్కలు చూస్తుంటే గత రికార్డులు తిరగరాయడం ఖాయమంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
ఓవర్సీస్‌లోనూ...
మరోవైపు, ఓవర్సీస్‌లోనూ 'OG' కలెక్షన్ల వర్షం కొనసాగుతోంది. ఫస్ట్ డేనే 4 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకుని రెండో రోజు 4.2 మిలియన్ గ్రాస్ దాటి దూసుకెళ్తోంది. త్వరలోనే 5 మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడం ఖాయమంటూ అంచనా వేస్తున్నారు.
మూవీలో పవన్ స్టైల్, యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచాయి. ఓ పవన్ అభిమానిగా ఫ్యాన్స్ ఏం కోరుకున్నారో అదే ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ సుజీత్. దీంతో సిల్వర్ స్క్రీన్‌పై పవర్ స్టార్ పవన్ బొమ్మ దద్దరిల్లిపోయింది. ఆయన గ్రేస్, జోష్‌కు తగ్గట్లుగా 'ఓజాస్ గంభీర'గా స్టైలిష్ పవన్‌ను చూశారు. పవర్ స్టార్ ఎలివేషన్స్‌కు తగ్గట్లుగా తమన్ బీజీఎం, సాంగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. దీంతో చాలా రోజుల తర్వాత తమ అభిమాన హీరోను అలా చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా... బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశారు. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషించారు.





















