Srikanth Odela : క్యారవాన్ లో ఉన్నంత వరకే అభిమానిని, సెట్లోకి అడుగు పెడితే వేరే లెక్క... చిరుపై ఓదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ఒక కొత్త ప్రాజెక్టు రాబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఓదెల చిరంజీవిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Chiranjeevi Srikanth Odela: యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. చిరంజీవికి తాను ఒక పెద్ద అభిమానని అని, అయితే సెట్స్ పైన అతన్ని ఒక క్యారెక్టర్ గా మాత్రమే చూస్తానని ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కామెంట్స్ చేశారు.
మూడో సినిమాకే చిరంజీవితో అవకాశం
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల... ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన సినిమాలే కాదు స్టేట్మెంట్లు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తన ఫస్ట్ మూవీ 'దసరా'తో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఈ యంగ్ డైరెక్టర్, ఆ మూవీతో బంపర్ హిట్ కొట్టడంతో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ఇతని దర్శకత్వ ప్రతిభను గుర్తించిన చిరంజీవి ఓదెలకి ఒక అవకాశం ఇచ్చారు. ఓదెల ప్రాజెక్టుకి చిరంజీవి ఓకే చెప్పడంతో ఓదెల కూడా ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ రెండవ మూవీగా నానితో 'ది ప్యారడైజ్' చేస్తున్నారు. మూడవ మూవీనే చిరుతో చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఓదెల కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవి గారి సినిమాలు తాను చిన్నప్పటి నుంచి చూసేవాడినని, ఇప్పుడు ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశాడు.
అక్కడే అభిమాని, ఇక్కడ మాత్రం క్యారెక్టర్
శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ కేవలం 48 గంటల్లోనే స్క్రిప్ట్ ని చిరంజీవితో ఓకే అనిపించడంతో తాను క్లౌడ్ నైన్ లో ఉన్నట్టు ఫీలయ్యానని తెలియజేశారు. చిరంజీవిని పాత తరహాలో కాకుండా వయసుకు తగ్గట్టుగానే, కొత్తగా చూపించబోతున్నానని చెప్పాడు. "నేను చిరంజీవికి ఎంత అభిమానిని అయినా కూడా... సెట్స్ పైకి వచ్చిన తర్వాత ఆయనను ఒక క్యారెక్టర్ గా మాత్రమే చూస్తాను" అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలే శ్రీకాంత్ ఓదెలకు సినిమా మీద ఎంత అంకితభావం ఉందో చెప్పకనే చెబుతున్నాయి. చిరంజీవిని కేవలం కథలోని ఒక క్యారెక్టర్ గా చూస్తానని చెప్పడంతో... అందరిలా కాకుండా కథ మీద అతనికి ఉన్న పట్టు ఈ మూవీని మరో రేంజ్ కి తీసుకు వెళ్తుంది అనడంలో సందేహం లేదు.
అవన్నీ రూమర్లే
చిరంజీవితో సినిమాలు తీయాలని, ఆయన పక్కన ఫోటోలు దిగాలని చాలామందికి ఉంటుంది. అలా ఎంతోమందికి ఇది అందని ద్రాక్షగానే పోతుంటే, ఓదెలకు ఈ అవకాశం రావడం గొప్ప విషయం అనే చెప్పాలి. 'దసరా' సినిమాతో ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ గా మారిన శ్రీకాంత్ ఓదెల... నానితో మరోసారి 'ది ప్యారడైజ్' అనే సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత చిరంజీవి మూవీ సెట్స్ పైకి తీసుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ మూవీ ఇంకా స్టార్ట్ కాకముందే చాలా రూమర్లు వచ్చాయి. ఈ మూవీలో పాటలు, హీరోయిన్లు ఉండవని రకరకాలుగా ప్రచారం చేశారు. అయితే వీటిపై నిర్మాత సుధాకర్ చెరుకూరి రీసెంట్ గా స్పందిస్తూ అవన్నీ ఫేక్ వార్తలని కొట్టి పడేశారు. మరి ఈ అవకాశాన్ని ఓదెల ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.