Andhra King Taluka: నువ్వుంటే చాలే... ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ సాంగ్ రిలీజ్ టైమ్ ఫిక్స్... రామ్ రాసిన పాట ప్రోమో చూశారా?
Ram Pothineni: 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాతో ఉస్తాద్ రామ్ పోతినేని లిరిసిస్ట్ గా మారారు. 'నువ్వుంటే చాలే' పాట రాశారు. ఆ సాంగ్ ప్రోమో విడుదలైంది.

ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) పెన్ను పట్టారు. తన కొత్త సినిమా కోసం లిరిసిస్ట్ అవతారం ఎత్తారు. 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో ఆయనొక పాట రాసిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ ప్రోమో విడుదల అయింది.
'నువ్వుంటే చాలే...' - రామ్ రాసిన గీతమిదే!
Nuvvunte Chaley Song Promo Released - Watch: 'ఆంధ్రా కింగ్ తాలూకా' కోసం 'నువ్వుంటే చాలే...' అంటూ రామ్ పోతినేని ఒక ప్రేమ గీతం రాశారు. ఈ రోజు విడుదల చేసిన ప్రోమో చూస్తే... గోదావరీ నదీ తీరంలో ఇసుక తిన్నెల మీద, రాజమండ్రిలో చక్కటి లొకేషన్లలోనూ సాంగ్ తీసినట్టు అర్థం అవుతోంది. కొన్నిసార్లు చిన్న చిన్న పదాలే బరువైన భావోద్వేగాలను మోస్తాయని ఈ పాట గురించి రామ్ పోతినేని ట్వీట్ చేశారు.
Nuvvunte Chaley Full Song Release Date Time: జూలై 18న 'నువ్వుంటే చాలే' సాంగ్ విడుదల చేస్తామని ఇంతకు ముందు చెప్పారు. ఇప్పుడు టైమ్ కూడా చెప్పారు. శుక్రవారం సాయంత్రం 5.04 గంటలకు లిరికల్ వీడియో విడుదల కానుంది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సాంగ్ పాడటం విశేషం. వివేక్ - మెర్విన్ ద్వయం సాంగ్ కంపోజ్ చేశారు. చిత్రానికి వాళ్లిద్దరూ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా... వంద సినిమాలతో సమానం - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ
Sometimes, the simplest words carry the deepest emotions…#NuvvunteChaley ❤️#AKTFirstSingle #NuvvunteChaley promo out now ✨
— RAm POthineni (@ramsayz) July 17, 2025
▶️ https://t.co/kqLz9Mw28H
Full song out on July 18th ❤️🔥
'ఆంధ్రా కింగ్ తాలూకా'కు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మీద నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.
రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమాకు కథ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: మహేష్ బాబు పి, నిర్మాతలు: నవీన్ యెర్నేని - వై. రవిశంకర్, నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్, సంగీతం: వివేక్ - మెర్విన్, ఛాయాగ్రహణం: సిద్ధార్థ నుని, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా.



















