Narne Nithin: ఘనంగా హీరో నార్నె నితిన్ వివాహం - బావమరిది పెళ్లిలో ఎన్టీఆర్ సందడి
Narne Nithin Wedding: టాలీవుడ్ యంగ్ హీరో నార్నె నితిన్ వివాహం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. బావమరిది పెళ్లిలో ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి సందడి చేశారు.

NTR Attends Narne Nithin Wedding In Hyderabad: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిది, టాలీవుడ్ యంగ్ హీరో నార్నె నితిన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నెల్లూరు జిల్లాకు చెందిన యువతి లక్ష్మి శివానితో ఆయన వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్ శివార్లలోని శంకర్పల్లిలో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. బావమరిది పెళ్లిలో ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్, భార్గవ్‌లు సందడి చేశారు. అతిథులను దగ్గరుండి మరీ ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Telangana Deputy CM Bhatti Vikramarka garu and #JrNTR @Bhatti_Mallu @tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/XPqnS13MC5
— AndhraNTRFC (@AndhraNTRFC) October 10, 2025
Also Read: 'శశివదనే' రివ్యూ: గోదావరి నేపథ్యంలో రక్షిత్, కోమలీ ప్రేమకథ - సినిమా ఎలా ఉందంటే?
నెల్లూరు జిల్లాకు చెందిన తాళ్లూరి కృష్ణప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె లక్ష్మీ శివానితో నార్నె నితిన్‌కు గతేడాది నవంబర్ 3న ఎంగేజ్మెంట్ జరిగింది. హైదరాబాద్‌లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు. శివానీ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా హీరో దగ్గుబాటి వెంకటేష్ కుటుంబానికి దగ్గరి బంధువులు కూడా.

ప్రముఖ బిజినెస్ మ్యాన్ నార్నె శ్రీనివాసరావు కుమారుడే నార్నె నితిన్... 2023లో 'మ్యాడ్' సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది 'మ్యాడ్ స్క్వేర్'తో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆయ్, శ్రీ శ్రీ శ్రీ రాజావారు మూవీస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.






















